Begin typing your search above and press return to search.

​క్లాసిక్ బ్యూటీ కి ఎదురుచూపులే

By:  Tupaki Desk   |   8 Aug 2017 7:37 AM GMT
​క్లాసిక్ బ్యూటీ కి ఎదురుచూపులే
X
మన హీరోయిన్లను విజయాలు అపజయాలు ఎప్పుడు ఎలా మలుపు తిప్పుతాయో ఎవరు ఊహించలేరు. నువ్వు హీరోయిన్ ఏమి అవుతావ్ అని హేళన చేసిన అమ్మాయి కూడా స్టార్ హీరోయిన్ అయిపోతుంది. నువ్వు హీరోయిన్ కన్నా అందంగా ఉన్నవే అనే అందం కూడా స్టార్ హీరోయిన్ కాలేదు. ఇప్పుడు మన తెలుగులో ఒక స్టార్ హీరోయిన్ కావాలని కలలు కనే హీరోయిన్ తన రోజు ఎప్పుడు వస్తుందా అని ఎదురుచూస్తుంది.

కంచె సినిమాతో తెలుగు ప్రేక్షకులుకు దగ్గరైన ప్రగ్యా జైస్వాల్ ఇప్పుడు తెలుగులో విజయం కోసం బాగానే కష్టపడుతుంది. ఎప్పటినుండో ఎదురు చూపులు చూస్తోంది. తన తాజా సినిమా నక్షత్రం సినిమా పై అన్నీ ఆశలు పెట్టుకున్న అది గాలిలో దీపం అయ్యింది. కంచె సినిమా మంచి పేరు తీసుకొని వచ్చిన ఆ తరువాత ‘మిర్చిలాంటి కుర్రోడు’ - ‘ఓం నమో వెంకటేశాయ’ - ‘గుంటూరోడు’ లాంటి సినిమా అవకాశాలు వెంటవెంటనే వచ్చిన ఏ సినిమా కూడా తన కెరియర్ ని పెద్దగా బూస్ట్ అప్ చేయలేదు. ఇప్పుడు విడుదలైన ‘నక్షత్రం’ సినిమా గురించి ఇంకా చర్చించడం కూడా ఉపయోగం లేదు. విమర్శకులే కాకుండా ప్రేక్షకులు కూడా సినిమాని తీవ్రంగా తిప్పి కొట్టారు. కృష్ణ వంశీ సినిమా అంతే అది కచ్చితంగా మంచి కథై ఉంటుంది కథనం అదిరిపోతుంది అని అంతా అనుకుంటే సినిమా ఏమో అలా బాక్స్ ఆఫీసు వద్ద మొదట ఆటకే ఔట్ అయ్యింది.

ప్రగ్యా జైస్వాల్ నక్షత్రం సినిమా కోసం యాక్షన్ సీక్వెన్సులు కూడా చేసింది. పోలీసు గా నటిస్తూ కొన్ని చోట్ల అవసరానికి మించి అందాలను కూడా వాడింది. బికినీల్లో మెరిసింది. కానీ ఆ ఉపాయలు ఏవి ఫలించలేదు ఈ సినిమాలో. ఇప్పుడు చేతిలో కొన్ని సినిమాలు ఉన్న అవి ఏవి అంతా క్రేజీ ప్రాజెక్టులు కావు అనే చెప్పాలి. అయితే ఈ వారం విడుదల కాబోతున్న మరో సినిమా పై తన ఆశలున్ని పెట్టుకుంది. బోయపాటి శ్రీను డైరెక్ట్ చేసిన ‘జయ జానకి నాయక’ సినిమాలో సెకండ్ హీరోయిన్ గా నటిస్తుంది. జయ జానకి నాయక లో లీడ్ హీరోయిన్ గా రకుల్ ప్రీత్ సింగ్ నటిస్తుంది. చూస్తుంటే ప్రగ్యా జైస్వాల్ ను ఈ సినిమాలో ఏదో ఆకర్షణ కోసం పెట్టినట్లు కనిపిస్తుంది. మరి సినిమానైనా ఈమె నట రాత మారుతుంది ఏమో చూద్దాం.​