Begin typing your search above and press return to search.
ఉన్నట్టుండి ప్రగ్య ఏజ్ లెస్ బ్యూటీగా.. కారణం తెలిస్తే షాకే!
By: Tupaki Desk | 7 Jun 2021 6:30 PM GMTఇటీవల షాక్ ల మీద షాక్ లిస్తోంది ప్రగ్య జైశ్వాల్. ఓవైపు బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో కెరీర్ పరంగా ఫుల్ బిజీ అయిపోతోంది. మరోవైపు టాప్ బ్రాండ్లకు సంతకాలు చేస్తూ సోషల్ మీడియాల్లో ప్రచారం సాగిస్తోంది. ఈ లాక్ డౌన్ సమయాల్లో వరుస ఫోటోషూట్లతో అభిమానుల్ని అలరించంది. జిమ్ యోగా విన్యాసాలతో సోషల్ మీడియాల్లో భారీ ఫాలోయింగ్ పెంచుకుంది. ఇక ఇంతలోనే ఉన్నట్టుండి ప్రగ్య వయసును తగ్గించేస్తూ షాక్ లిస్తోంది. అసలు దీనికి టిప్స్ ఏవో తెలిస్తే కచ్ఛితంగా యువతరం ఫాలో చేస్తారు.
రెండు లాక్ డౌన్ల మధ్య పరిశీలిస్తే ప్రగ్య వయసు తగ్గి కనిపిస్తోంది. దానికి కారణం ఈ ఖాళీ సమయాన్ని ఎంతో బాగా సద్వినియోగం చేసుకుందట. రెగ్యులర్ గా యోగా ప్రాణాయామంతో ఇది సాధ్యమైంది. మునుపటితో పోలిస్తే ప్రగ్యలో నునుపుదనం స్మార్ట్ నెస్ పెరిగింది.
కోవిడ్ కేర్ లో భాగంగా టీకాలు వేసినా అన్ని రకాలుగా హెల్త్ ప్రోటోకాల్ ను అనుసరిస్తూ.. ఫిట్‌నెస్ టిప్స్ ని పాటిస్తూ ఉండాలని తాను అలానే చేస్తున్నానని ప్రగ్య తెలిపింది. ప్రగ్యా తనను శారీరకంగా మానసికంగా ఆరోగ్యంగా ఉంచుకునే పనిలో ఉంది. వర్కౌట్స్ తన అతిపెద్ద స్ట్రెస్ బస్టర్స్ అని చెబుతోంది. వర్కవుట్లపై తనకున్న ప్రేమను దాచుకోకుండా.. మనస్సును ఆహ్లాదపరిచి చురుకుగా ఉంచుతుందని తెలిపింది.
నేను ఉదయాన్నే జిమ్ యోగా చేస్తాను. సాయంత్రం ఎప్పుడూ వ్యాయామం చేయలేదు. నేను షూటింగ్ నుండి తిరిగి వచ్చే సమయానికి బాగా అలసిపోయేదానిని. నాకు 5-6 గంటల నిద్ర కూడా అవసరం, రాత్రి షూట్ లు చేయాల్సొస్తే కొన్నిసార్లు నిద్ర ఇంకా ఎక్కువ అవసరం. కానీ ఇప్పుడు మహమ్మారి కారణంగా.. నేను సాయంత్రం వ్యాయామం చేయడానికి సమయం కేటాయించాను అని ప్రగ్య చెప్పింది.
నేను ప్రాణాయామం ఎందుకు చేయలేదని నా తల్లి నన్ను అడిగింది. ఇది ప్రారంభంలో సవాలుగా అనిపించింది. కానీ వేగంగానే ఇది ఒక అద్భుతమైన విషయం అని గ్రహించాను. ఇది నన్ను శాంతపరుస్తుంది ..నా ఆందోళనను తగ్గిస్తుంది`` అని తెలిపింది. ప్రగ్యకు శ్వాశ వ్యాయామాలు తన మామ్ నేర్పించారట. బాలయ్య సరసన అఖండ సహా సల్మాన్ భాయ్ యాంటిమ్ లోనూ ప్రగ్య నాయికగా నటిస్తోంది. పలు ఇతర చిత్రాలకు సంతకాలు చేసింది. ఇన్ స్టాలో ప్రగ్య షేర్ చేసిన బ్లూ డెనిమ్ లుక్ ఎంతో ప్లెజెంట్ గా కనిపిస్తోంది. అభిమానుల్లోనూ వైరల్ గా మారింది.