Begin typing your search above and press return to search.

ఫోటో స్టోరి: బ్ల‌ర్ టెక్నిక్ తో కంచె వేసిన అందం

By:  Tupaki Desk   |   20 Nov 2021 6:31 AM GMT
ఫోటో స్టోరి: బ్ల‌ర్ టెక్నిక్ తో కంచె వేసిన అందం
X
`కంచె` బ్యూటీ ప్ర‌గ్యా జైశ్వాల్ ఆర‌బోత‌ కంచె తెగిపోయిన సంగ‌తి తెలిసిందే. ప‌ర‌దా తొల‌గించి అందాల విందు చేయ‌డంలో ప్ర‌గ్యా త‌ర్వాతే. ఇటీవ‌లి లాక్ డౌన్ సీజ‌న్ లో ప్ర‌గ్య ప్ర‌మోష‌న‌ల్ స్టంట్ యూత్ కంటికి కునుకు క‌రువ‌య్యేలా చేసింది. ఎప్ప‌టిక‌ప్పుడు కొత్త ఫోటో షూట్ల తో టెంప్ట్ చేయ‌డం ఈ బ్యూటీ ప్ర‌త్యేక‌త‌. సంద‌ర్భాన్ని బ‌ట్టి చిచ్చ‌ర పిడుగులా చెల‌రేగడం త‌న‌కే చెల్లింది. డిజైన‌ర్ దుస్తుల్లో ఈ బ్యూటీ అంద‌చందాలు వైర‌ల్ అయ్యాయి. అలాగే బికినీ..టూపీస్ పీస్ ..థై ఎలివేష‌న్స్ తో అగ్గిరాజేయ‌డం ప్ర‌గ్యాలో మ‌రో యాంగిల్. తాజాగా అమ్మ‌డు మ‌రోసారి వేడి పెంచింది. లోదుస్తులు ధ‌రించి టాప్ యాంగిల్ లో దిగిన ఓ సెల్ఫీని ఇన్ స్టాలో విడుద‌ల చేసింది.

ఈ ఫోటోలో అందాల ప్ర‌ద‌ర్శ‌న‌ హైలైట్ గా ఉన్నా బ్ల‌ర్ చేసి ఇంకా కిక్కు పెంచింది ప్ర‌గ్యా. విర‌బూసిన కురుల‌లో...కొంటె చూపుల కోనంగిలా మైమ‌రిపిస్తోంది ఈ ముంబై బ్యూటీ. ప్ర‌స్తుతం ఈ ఫోటో ఇన్ స్టాలో వైర‌ల్ గా మారింది. ప్ర‌గ్యా ఇలా చెల‌రేగ‌డం ఇప్పుడే కొత్తేమీ కాదు. గ‌తంలోనూ చాలాసార్లు నాభి సొగ‌సుల‌ను ఆవిష్క‌రిస్తూ లేదా ..థై..ఎద అందాల ఎలివేష‌న్స్ తో ఆక‌ట్టుకుంది. తాజాగా మ‌రోసారి ప్ర‌కంప‌నలు రేపుతోంది. ఇక‌ ప్ర‌గ్యాజైశ్వాల్ సినిమాల విష‌యానికి వ‌స్తే న‌ట‌సింహ బాల‌కృష్ణ‌ క‌థానాయ‌కుడిగా న‌టిస్తోన్న `అఖండ‌`లో న‌టిస్తోంది. ఈ సినిమా విజ‌యం సాధిస్తే త‌న ఫేట్ మారుతుంద‌నే భావిస్తోంది. త‌దుప‌రి ప‌వ‌న్ స‌ర‌స‌నా ఓ చిత్రంలో న‌టించ‌నుంద‌ని గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి.

లాగే బాలీవుడ్ లో స‌ల్మాన్ ఖాన్ స్వీయా నిర్మాణంలో తెర‌కెక్కుతోన్న `ది ఫైన‌ల్ ట్రూత్` లోనూ న‌టిస్తోంది. ప్ర‌స్తుతానికి ఈ రెండు చిత్రాలే ప్ర‌గ్యా చేతిలో ఉన్నాయి. కొత్త అవ‌కాశాలు కోసం సీరియ‌స్ గానే ప్ర‌య‌త్నాలు చేస్తూ ఉంది. కానీ టైమ్ క‌లిసి కార‌వ‌డం లేదు. అయితే టాలీవుడ్ పైనే ఎక్కువ‌గా ఫోక‌స్ పెట్టి ప‌నిచేస్తోంది. మ‌రి బాలీవుడ్ కాంపిటీష‌న్ నిత‌ట్టుకుని నిల‌బ‌డ‌టం క‌ష్ట‌మ‌ని భావించిందో ఏమో! స‌ల్మాన్ తో ఓ సినిమా లైన‌ప్ లో ఉన్నా హైద‌రాబాద్ లోనే మ‌కాం. హిందీలో పెద్ద‌గా ప్ర‌య‌త్నాలు చేయ‌న‌ట్లు తెలుస్తోంది.