Begin typing your search above and press return to search.

ఫోటో స్టోరి: ప్ర‌గ్యా ఈ మంట‌లు ఆరేదెలా?

By:  Tupaki Desk   |   29 Dec 2021 4:33 AM GMT
ఫోటో స్టోరి: ప్ర‌గ్యా ఈ మంట‌లు ఆరేదెలా?
X
హాట్ బ్యూటీ ప్ర‌గ్యాజైశ్వాల్ ఎట్ట‌కేల‌కు `అఖండ‌` చిత్రంతో భారీ హిట్ ని ఖాతాలో వేసుకుంది. `కంచె` విజ‌యం త‌ర్వాత సరైన స‌క్సెస్ లేక ఇబ్బందిప‌డుతోన్న బ్యూటీకి `అఖండ` సక్సెస్ బిగ్ బూస్ట్ ఇచ్చింద‌నే చెప్పాలి. నిజానికి ప్ర‌గ్యా కెరీర్ కి సిస‌లైన క‌మర్శియ‌ల్ స‌క్సెస్ గా అఖండ మాత్ర‌మే. ఇప్ప‌టివ‌ర‌కూ చాలా సినిమాల్లో న‌టించినా కానీ అవేవీ యావ‌రేజ్ స‌క్సెస్ లుగా కూడా రాణించ‌లేక‌పోయాయి. చాలాకాలంగా స్ట్ర‌గ్లింగ్ నాయిక‌గా ప్ర‌గ్యా కి స‌రైన స‌క్సెస్ లేదనే ఓ వెలితి వెంటాడేది. ఇప్పుడా ఆ అసంతృప్తిని `అఖండ` దూరం చేసింద‌నే చెప్పాలి. నట‌న‌కు ఆస్కారం ఉన్న మంచి రోల్ ద‌క్క‌డంతో ప్ర‌గ్యా ట్యాలెంట్ సైతం `అఖండ‌`తో బ‌య‌ట‌ప‌డింది.

బాల‌య్య తో ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ వ‌ర్కౌట్ అయింది. సీనియ‌ర్ హీరోల‌కు ప్ర‌గ్యా ఓ ఆప్ష‌న్ గా నిలుస్తోంది అన్న భ‌రోసా క‌నిపించింది. `అఖండ` సక్సెస్ మ‌రిన్ని అవ‌కాశాల‌కు బాట వేస్తుంది? అన్న కాన్పిడెన్స్ త‌న‌లో ఉంది ఇప్పుడు. చిరంజీవి..నాగార్జున‌..వెంక‌టేష్ లాంటి సీనియ‌ర్ స్టార్ హీరోల‌కు స‌రి జోడీ కుదురుతంది అన్న పాజిటివ్ ఫీడ్ బ్యాక్ వ‌స్తోంది. ఆ ర‌కంగా ప్ర‌గ్యా కెరీర్ ముందుకు సాగిపోవాల‌ని ఆశిద్దాం. ఇక ఈ బ్యూటీ ఇన్ స్టాలో ఎంత యాక్టివ్ గా ఉంటుందో చెప్పాల్సిన ప‌నిలేదు. నిత్యం కొత్త ఫోటోషూట్ల‌తో ఇన్ స్టాలో మంట‌లు రేప‌డం త‌న‌కు అల‌వాటు.

తాజాగా మ‌రో కొత్త ఫోటోషూట్ తో ఇన్ స్టాని షేక్ చేస్తుంది. డార్క్ పింక్ క‌ల‌ర్ మిరుమిట్లు గోలిపే దుస్తుల్లో మెరిసిపోతోంది. బ్యాక్ గ్రౌండ్ లో లైటింగ్ సెట‌ప్ న‌డుమ ప్ర‌గ్యా మ‌రింత అందంగా క‌నిపిస్తుంది. ప్రస్తుతం ఈ ఫోటోగ్రాఫ్ ఇన్ స్టాలో వైర‌ల్ గా మారింది. ఈ ఫోటో చూప‌రుల‌ను ఆక‌ట్టుకుంటోంది. నెటిజ‌న‌లు ఆస‌క్తిక‌ర కామెంట్లు పోస్ట్ చేస్తున్నారు.