Begin typing your search above and press return to search.
మనోహరిలా మంత్ర ముగ్దుల్ని చేస్తోందే!
By: Tupaki Desk | 19 Aug 2022 12:41 PM GMTపూణే సోయగం ప్రగ్యాజైశ్వాల్ `అఖండ` సక్సెస్ తర్వాత కెరీర్ వేగం పుంజుకుంటుందుని బోలెడన్ని ఆశలు పెట్టుకుంది. చిరంజీవి..నాగార్జున..వెంకటేష్ లాంటి సీనియర్ హీరోలకు పర్పెక్ట్ గా సూటవుతుందని భావించినా వాళ్లంతా నవతరం భామలవైపు చూడటంతో ప్రగ్యా కి ఛాన్స్ రావడం లేదు. అలాగని నవతరం హీరోలు ఆమెని కాస్తైనా ప్రోత్సహించే వాతావరణం కనిపించలేదు.
`అఖండ` తర్వాత కలెక్షన్ కింగ్ మోహన్ బాబు నటించిన `సన్నాఫ్ ఇండియాలో` ఛాన్స్ అందుకుంది గానీ..ఫలితం నిరాశపరించింది. ఆ రకంగా అఖండ సక్సెస్ వృద్ధాగా పోతుంది. ప్రస్తుతం ప్రగ్యా చేతిలో ఒక్క సినిమా కూడా లేదు. అలాగని వెబ్ సిరీస్లు..టీవీ షోలతోనైనా బిజీగా ఉందంటే? అదీ కనిపించలేదు. కేవలం అప్పుడప్పుడు ఇన్ స్టాలో అందంగా అభిమానుల్ని అలరించడం తప్ప ప్రగ్యా వృత్తి పరంగా బిజీ కాలేకపోతుంది.
తాజాగా అమ్మడు ఓ కొత్త ఫోటోతో ఇన్ స్టాకి ఎక్కేసింది. ఇది గో ఇక్కడిలా సంప్రదాయ దుస్తుల్లో కనువిందు చేస్తుంది. డిజైనర్ ప్లోరల్ దుస్తుల్లో రాకుమారిలా ముస్తాబైంది. ఎల్లో కలర్ వర్ణంలో అమ్మడు ధగఢగలాడిపోతుంది. ప్రగ్యా మెడలో డిజైనర్ నెక్లెస్ అమ్మడి నెక్ ని మరింత అందంగా తీర్చిదిద్దింది. నెక్ ని మ్యాచ్ చేస్తూ చేతి వేలికి తొడిగిన డిజైనర్ రింగ్ సైతం అంతే ఆకర్షణీయంగా హైలైట్ అవుతుంది. అమ్మడి ముఖంలో సంపూర్ణమైన నవ్వు మరింత బ్యూటీని యాడ్ చేసింది.
ప్రస్తుతం ఈ ఫోటో నెట్టింట వైరల్ గా మారింది. చూసి ఆస్వాదించడం అభిమానుల వంత్తైంది. ఈ రకమైన బ్యూటీ సెషన్స్ అయినా ప్రగ్యాకి అవకాశాలు తెచ్చిపెడతాయా? అంటే అదీ కనిపించడం లేదు. అందాలు ఎంతగా ప్రదర్శించినా అక్కడా పోటీ తీవ్రంగానే ఉంది. వాళ్లతో కాంపిటీషన్ ఎదుర్కొని దర్శక-నిర్మాతల దృష్టిని ఆకర్షించాలి.
అందుకు లక్ ప్యాక్టర్ కూడా కలిసి రావాలి. ఎంత శ్రమించినా ఆ శ్రమని గుర్తించే నాధుడు లేకపోతే ఎన్ని చేసినా? అన్ని వృద్ధా ప్రయత్నాలుగానే మిగిలిపోతాయి. సల్మాన్ ఖాన్ సరసన `యాంటిమ్` సినిమాలో నటించిన ఈ బ్యూటీని మధ్యలో తప్పించారంటే? ఎంతటి దురదృష్టవంతురాలో అద్ధం పడుతోంది. కానీ ఆ సినిమా పెద్దగా ఆడలేదనుకోండి.