Begin typing your search above and press return to search.

నిన్ను చూడాలా? నీ వెన‌క బ్యూటీని చూడాలా?

By:  Tupaki Desk   |   7 Jun 2022 2:30 AM GMT
నిన్ను చూడాలా? నీ వెన‌క బ్యూటీని చూడాలా?
X
బార్సిలోనా (స్పెయిన్‌) అందాల గురించి చెప్పాల్సిన ప‌నే లేదు. ప్ర‌ఖ్యాత ప‌ర్యాట‌క‌ న‌గ‌రంలో అరుదైన భ‌వంతులు లొకేష‌న్ల‌కు ముగ్ధులు కాని వారు ఉండ‌రు. బార్సిలోనాలో షూటింగుల కోసం మ‌న నిర్మాత‌లు ఎంతో ఆస‌క్తిని క‌న‌బ‌రిచేది వీటికోస‌మే. ఈ న‌గ‌రం స్పెయిన్ లో అత్యంత పాపుల‌ర్ పర్యాటక ప్రాంతంగా వెలిగిపోవ‌డానికి కార‌ణం.. ఇక్క‌డ‌ సంస్కృతి- ఆహారం- కళ.. వీటితో పాటు గొప్ప‌ చరిత్ర ఆక‌ర్షిస్తుంది. ఈ అద్భుతమైన ఇన్ ఫ్రా నగరాన్ని సందర్శించే వారంతా రోడ్ ట్రిప్ ద్వారా అక్క‌డి అందాల‌ను వీక్షించేందుకు ఆస‌క్తిని క‌న‌బ‌రుస్తుంటారు.

భారీ ఆర్కిటెక్చ‌ర్ తో అత్యంత భారీ భ‌వంతుల‌తో పాటు పర్ఫెక్ట్ బీచ్ లతో ఆకర్షణీయమైన తీర పట్టణాలు బార్సిలోనాలో ఆక‌ర్షిస్తాయి. విశాల‌మైన ఓపెన్ ప్రకృతితో లొకేష‌న్లు ఎన్నో ఇక్క‌డ ఉన్నాయి. గత చరిత్రకు ఆన‌వాళ్లు ఇక్క‌డ ల‌భిస్తాయి. అయితే అలాంటి అరుదైన న‌గ‌రంలో అడుగుపెట్టిన ముంబై బ్యూటీ ప్ర‌గ్య జైశ్వాల్ అక్క‌డ వ‌రుస ఫోటోషూట్ల‌తో వేడి పెంచుతోంది.

తాజాగా మినీ మిడ్డీ దుస్తుల్లో ప్ర‌గ్య ఫోటోషూట్ వీడియో వైర‌ల్ గా దూసుకెళుతోంది. ఇక ప్ర‌గ్య మిడ్డీ అందాల‌ను మించి బ్యాక్ గ్రౌండ్ లో బార్సిలోనా అందాలు ఊరిస్తున్నాయి. ఈ వీడియో వీక్షించాక‌.. నిన్ను చూడాలా? నీ వెన‌క బార్సిలోనా బ్యూటీని చూడాలా? అభిమానులు స‌ర‌దాగా ప్ర‌శ్నిస్తున్నారు.

ప్రగ్యా జైస్వాల్ ఫ్యాషన్ ఎంపిక‌లు కేవ‌లం సినిమాల వ‌ర‌కే పరిమితం కాలేదు. డ్రెస్సింగ్- ఫ్యాషన్- ట్రావెల్- ఫిట్ నెస్- డ్యాన్స్ ఇలా ప్ర‌తి విభాగంపైనా తనకున్న ప్రేమ ఆస‌క్తి గురించి ఓపెన్ అయ్యింది. నాకు ఎప్పుడూ మంచి డ్రెస్సింగ్ సెన్స్ అంటే ఇష్టం. నేను మోడల్ గా కెరీర్‌ని ప్రారంభించాను. దానికోసం ప్రిపేర్ అయ్యే ప్రక్రియ మొత్తాన్ని ఆస్వాధించాను అని ప్రగ్యా జైస్వాల్ చెప్పింది.

ఎల్లప్పుడూ ప్రపంచవ్యాప్తంగా ట్రెండింగ్ లో ఉన్నవాటిని పరిశీలిస్తాను. ఇత‌రులు ఎలాంటి దుస్తులు ధ‌రిస్తారు? అన్న‌ది ఒక ఫ్యాష‌నిస్టాగా క‌నుగొంటాను. కాబట్టి ఫ్యాషన్ ప‌రంగా జాగ్రత్తగా వ్య‌వ‌హ‌రిస్తాను.. అని తెలిపారు. కానీ సినిమాల‌కు పని చేస్తున్నప్పుడు నాకు న‌చ్చేవి మాత్ర‌మే ధరించలేను. కాబట్టి షూటింగ్ చేయనప్పుడు నేను ఇష్టపడే వాటిని ధరిస్తాను. నా విమానాశ్రయం లుక్స్ దానికి ఉదాహరణ (నవ్వుతూ ).. కాబట్టి నేను ప్రయోగాలు చేయడాన్ని ఇష్టపడతాను.. అని అన్నారు. నేను కొన్నిసార్లు నా వ్యక్తిత్వాన్ని ప్రతిబింబించే పాత్ర‌లు చేయాల‌నుకుంటాను అని కూడా అన్నారు.

ఆరోగ్యం అందం గురించి ప్ర‌స్థావిస్తూ...ధ్యానం వర్కవుట్ లు చేయడం నాలో ఉత్తమమైన సంస్కరణల‌ను తెచ్చింది. ధ్యానం చేయడం ద్వారా మరింతగా న‌న్ను నేను అన్వేషించడానికి అవ‌కాశం దొరికింది. ఇక ఇష్టంగా తినే వాటి గురించి ప్ర‌గ్య మాట్లాడుతూ.. బిర్యానీ- హలీమ్ స‌హా హైదరాబాదీ ఫుడ్ కి తాను విపరీతమైన అభిమానిని అని తెలిపారు.
నేను ఏ రూపంలో ఉన్నా లేదా ఫిట్‌నెస్ తో సంతోషంగా ఉన్నాను. కానీ డ్యాన్స్ అనేది మరో స్థాయి. చెమటతో పాటు మ‌న‌లోని సంతోషకరమైన హార్మోన్లు బయటకు విడుద‌ల‌వుతాయి అని తెలిపారు.

ఇక సినీప‌రిశ్ర‌మ‌లో సన్నిహిత సంబంధాలను కొనసాగించడానికి ప్ర‌గ్య చాలా ప్రాధాన్యతనిస్తుంది. నా జీవితంలో మంచి స్నేహితులను కలుసుకోవడం అలాంటి వారిని సంపాదించడం నా అదృష్టం. నేను చేసే ప్రతి పనికి మద్దతిచ్చే కుటుంబం నాకు ఉన్నందుకు కూడా నేను కృతజ్ఞురాలిని. కాబట్టి బిజీగా లేనప్పుడు లేదా బిజీగా ఉన్నప్పుడు కూడా.. షెడ్యూల్ ల మధ్య స్నేహితులతో కలుసుకోవడానికి నేను సమయాన్ని వెచ్చిస్తాను అని తెలిపింది. అఖండ త‌ర్వాత ప్ర‌గ్య ప‌లువురు అగ్ర హీరోల స‌ర‌స‌న అవకాశాలు అందుకుంద‌ని క‌థ‌నాల‌చ్చాయి. కానీ వాటి కి సంబంధించిన పూర్తి స‌మాచారం తెలియాల్సి ఉంది.