Begin typing your search above and press return to search.
తాగుబోతులకు కంచె భామ క్లాసులు
By: Tupaki Desk | 5 Jun 2016 4:41 AM GMTహైద్రాబాద్ పోలీసుల తీరు భలే మారిపోతోంది. పనిష్మెంట్ ని కూడా అందంగా డిజైన్ చేసేస్తున్నారు. అందమైన భామలతో క్లాసులు ఇప్పించేస్తున్నారు. ప్రస్తుతం హైద్రాబాద్ లో డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులపై పోలీస్ డిపార్ట్ మెంట్ బాగా కాన్సంట్రేట్ చేసింది. మొదటిసారి దొరికిన వాళ్లకి ప్రముఖులతో కౌన్సిలింగ్ లు ఇప్పిస్తుంది. ఈ కార్యక్రమంలో భాగంగా ఇప్పుడు కంచె హీరోయిన్ ప్రగ్యాజైస్వాల్ కూడా తెగ క్లాసులు పీకేసింది.
'టూవీలర్స్ నడిపే వారు ఎవరైనా సరే హెల్మెట్ వాడండి. ఫోర్ వీలర్స్ డ్రైవ్ చేసే వాళ్లయితే సీట్ బెల్టు పెట్టుకోండి. లిక్కర్ తాగి డ్రైవ్ చేయడం ప్రమాదకరం. సెల్ ఫోన్ మాట్లాడూతు వాహనాలు నడపద్దు' ఇవీ కంచె సుందరి చెప్పిన మాటలు. మామూలుగా అయితే వీటిలో పెద్ద స్పెషాలిటీ ఏముండదు కానీ.. అందమైన హీరోయిన్ వచ్చి చెబుతుంటే మాత్రం ఎంత సేపైనా వినాలని అనిపిస్తుంది కదా. అదీ హైద్రాబాద్ పోలీసుల ఐడియా.
రోడ్ ప్రమాదాలను అరిగట్టడంపై ఓ మొబైల్ సేఫ్టీ యాప్ ను ట్రాఫిక్ పోలీసులు తయారు చేయించగా.. దాని లాంఛింగ్ కూడా ప్రగ్యా జైస్వాల్ చేతుల మీదుగానే జరిగింది. మొత్తానికి చిరిగిన జీన్స్ వేసుకుని, గ్లామరస్ గా డ్రసింగ్ చేసుకుని మరీ వచ్చి.. క్లాసులు పీకిన కంచె భామ మాటలను.. మరి తాగుబోతులు ఏ రేంజ్ లో రిసీవ్ చేసుకున్నారో కదా!