Begin typing your search above and press return to search.
ఆ చీరల పిల్ల ఇప్పుడు బ్యాడ్ పోలీస్
By: Tupaki Desk | 18 Oct 2016 11:53 AM GMTఅప్పటివరకు ఓ రెండు మూడు సినిమాలు చేసినా సంపాదించలేని పేరును.. ముంబయ్ మోడల్ ప్రగ్యా జైస్వాల్ ఒకే ఒక్క సినిమాతో కొట్టేసింది. అదే ''కంచె'' సినిమా. మెగా హీరో వరుణ్ తేజ్ సరసన ఆమె పీరియడిక్ బ్యాక్ డ్రాప్ లో అత్యధ్భుతంగా మెరిసింది. అయితే ఆ సినిమా సక్సెస్ అయినప్పటికీ ఎందుకో ప్రగ్యా మాత్రం తరువాత తన కెరియర్ ను సరిగ్గా సెట్ చేసుకోలేకపోయింది.
ఇకపోతే కంచె సినిమాలో అమ్మడు తన చీరకట్టులో ఎలా ఆకట్టుకుందో తెలిసిందే. ప్రతీ పాటలోనూ అలాగే ప్రతీ సీన్లోనూ ప్రగ్యా చీరల్లో కురిపించిన అందాలు ఓ రేంజులో ఉంటాయి. ఆ సినిమా తరువాత చాలా గ్యాప్ తీసుకున్న ప్రగ్యా ఇప్పుడు కృష్ణవంశీ తీస్తున్న ''నక్షత్రం'' సినిమాలో సాయధరమ్ తేజ్ సరసన ఒక ప్రత్యేక పాత్రలో కనిపించనుంది. అమ్మడు ఈ సినిమాలో ఒక బ్యాడ్ పోలీస్ పాత్రను చేస్తోందట. అందుకే చూశారుగా.. ఫస్టు లుక్ పోస్టర్లో జీను ప్యాంట్ అండ్ షర్ట్ వేసుకుని.. చాలా కరుక్కుగా అలా ఉందండోయ్.
ఈ చీరల పిల్ల పోలీస్ అవతారంలో ఇలా కాస్త మాస్ గా ఉన్నా కూడా.. పాటల్లో మాత్రం సాయిధరమ్ పక్కనే అందాలు విరబూయించిందట. అది సంగతి.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/