Begin typing your search above and press return to search.

స్విమ్ సూట్లో కూడా చెక్కిన శిల్పంలా ఉంది!

By:  Tupaki Desk   |   10 Jun 2020 2:30 AM GMT
స్విమ్ సూట్లో కూడా చెక్కిన శిల్పంలా ఉంది!
X
ప్రగ్యా జైస్వాల్. సినీ ఇండస్ట్రీకి దొరికిన మరో పొడుగుకాళ్ల సుందరి. కెరీర్ ప్రారంభం నుండి గ్లామర్ రోల్స్ చేస్తూ వస్తున్న ప్రగ్యా 2014లో వచ్చిన 'డేగ' సినిమాతో తెలుగు తెర పై మొదటిసారి మెరిసింది. ఇక అదే సంవత్సరం 'టిటు ఎంబిఏ' సినిమాతో బాలీవుడ్ లో కూడా అడుగుపెట్టింది గుమ్మ. మధ్యప్రదేశ్ రాష్ట్రానికి చెందిన ఈ పొడుగు సుందరి 'కంచె' సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది. అలా ప్రేక్షకులకు దగ్గరవడానికి ఆమె కనబరిచిన అందాల ఆరబోతే ప్రధాన కారణం. అప్పటి నుండి ప్రగ్యా ఏ మాత్రం వెనక్కి తిరిగి చూడకుండా విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ తో తెలుగులో రెచ్చిపోతూ తన సొగసులను దారపోసింది. ప్రగ్యా అందాలు చూసి పిచ్చెక్కిపోయే వీరాభిమానులు లక్షల్లో ఉన్నారు. అలా కంచె సినిమా తర్వాత వరుసగా గుంటూరోడు, నక్షత్రం సినిమాలు చేసింది. ఇక ఆ సినిమాలతో ఏకంగా కుర్రకారుకి నిద్రలేకుండా చేసింది. నక్షత్రంలో సినిమాలో ప్రగ్యా అందాలను అన్ని యాంగిల్స్ లో క్యాచ్ చేసారు మేకర్స్.

ప్రగ్యా తెలుగులో చివరగా కనబడిన సినిమా మాత్రం 2018లో వచ్చిన ఆచారి అమెరికా యాత్ర. తర్వాత అమ్మడు మళ్లీ తెలుగు తెరపై కనిపించలేదు. కానీ ఎల్లప్పుడూ అభిమానులను సోషల్ మీడియా ద్వారా అలరిస్తూనే ఉంటుంది. ఇక తాజాగా ప్రగ్యా చేసిన ఫోటో షూట్ చూస్తే మాత్రం కుర్రాళ్లకు మతిపోవడం ఖాయం. పింక్ టాప్ స్విమ్ సూట్ లో సముద్ర తీరాన అమ్మడి పోజులు చూస్తే అభిమానులు నిద్రలో కూడా కలవరించడం పక్కా అనేలా ఉన్నాయి ప్రగ్యా సోయగాలు. తన అద్భుతమైన ఎక్సప్రెషన్స్ తో, వేడెక్కించే ఫిగర్ తో సోషల్ మీడియాను హీటెక్కిస్తోంది కుర్రభామ. ప్రగ్యాను చూస్తే ఎవరైనా చెక్కిన శిల్పమే అంటారు. ఆమె మేనిరూపం అలా బికినీ ధరించి కదులుతూ ఉంటే అలల తాకిడి గుండెను తాకినట్లుగా అమ్మడి సొగసులు మదిలో మెదులుతున్నాయి అంటున్నారు అభిమానులు. ప్రగ్యా పోజులు చూస్తున్న అభిమానులు కళ్ళు పక్కకు తిప్పుకోలేక పోతున్నారు. చూడాలి మరి త్వరలో మళ్లీ అమ్మడు తెలుగు తెరపై మెరుస్తుందేమో!