Begin typing your search above and press return to search.

భక్తిలో రక్తిని మిక్స్ చేయడంలో ఆయన తర్వాతే

By:  Tupaki Desk   |   23 Nov 2016 5:30 PM GMT
భక్తిలో రక్తిని మిక్స్ చేయడంలో ఆయన తర్వాతే
X
భక్తిరస చిత్రాలంటే గతంలో ఓ రేంజ్ లో ఉండేవి. భక్తి.. విపరీతమైన మ్యూజిక్.. సెంటిమెంట్ పండించేయడం.. పూనకాలు రప్పించేయడం టైపులో తెలుగు భక్తి చిత్రాలు సాగేవి. కానీ ఇలాంటి ట్రెండ్ ను ఫాలో అయితే ఆయన దర్శకేంద్రుడు ఎందుకు అవుతారు?

కె. రాఘవేంద్రరావు భక్తి చిత్రాలు తీయడంలో ఆరితేరిపోయారు. తీసిన ప్రతీ భక్తి చిత్రంతో హిట్ కొట్టడమే కాదు..అన్నీ అవే తీస్తున్నారు కూడా. ప్రస్తుతం నాగార్జునతో ఓం నమో వేంకటేశాయ మూవీ తీస్తున్న ఆయన.. ఇందులో ప్రగ్యా జైస్వాల్ తో చేయించిన గ్లామర్ రోల్ చూసి అందరూ ఆశ్చర్యపోయారు. భక్తి మూవీలో ఇలాంటి గ్లామర్ డోసా అనుకున్నారు. కానీ ఇలాంటివి చేయడం ఆయనకు కొత్తేం కాదు. మొదటగా అన్నమయ్య మూవీలో రోజా చేసిన రోల్ ను చెప్పుకోవాలి. మోహన్ బాబు- రోజా కాంబినేషన్ లో వచ్చే రొమాంటిక్ సీన్స్.. వారి యాక్షన్ అప్పట్లో కొంత వివాదం కూడా సృష్టించాయి.

ఆ తర్వాత బాలకృష్ణ మూవీ పాండురంగడులో అయితే.. టబుతో చేయించిన బోల్డ్ కేరక్టర్ అందరికీ షాక్ కొట్టించేసింది. ఇప్పుడు ప్రగ్యా జైస్వాల్ ఇలాంటి రోల్ నే చేస్తోందంతే. ఈ భక్తి సినిమాల్లో ఒకట్రెండు చోట్ల 'కామి కాని వాడు మోక్షగామి కాడు' అంటూనో.. అదే అర్ధం వచ్చేలానో డైలాగ్ పెట్టి మరీ.. సమర్ధించేసుకుంటూ ఉంటారాయన. మొత్తానికి భక్తి సినిమాకి వెళ్లేవాళ్లకు రక్తితోనూ అనురక్తి పంచడంలో రాఘవేంద్రరావు తర్వాతే ఎవరైనా!

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/