Begin typing your search above and press return to search.
ప్రగ్యాజైశ్వాల్ కి కరోనా..`అఖండ` టీమ్ కి టెన్షన్!
By: Tupaki Desk | 10 Oct 2021 12:30 PM GMTముంబై బ్యూటీ ప్రగ్యాజైశ్వాల్ కరోనా బారిన పడింది. ఆదివారం అనుమానం వచ్చి కరోనా టెస్ట్ చేయించుకోగా కొవిడ్ పాజిటివ్ గా తేలింది. ఈ విషయాన్ని అమ్మడు ఇన్ స్టా వేదికగా ప్రకటించిన..తనని కలిసిన వారందర్ని పరీక్షలు చేయించుకోవాల్సిందిగా హెచ్చరించింది. ప్రగ్యా ఇప్పటికే కొవిడ్ వ్యాక్సిన్ రెండు డోసులు తీసుకుంది. అయినా కరోనా బారిన పడింది. అయితే ఆమె కరోనా బారిన పడటం ఇది రెండవ సారి. ఇంతకు ముందు ఒకసారి కరోనా సాకింది. అప్పుడు ఇంట్లూనే ఉండి చికిత్స తీసుకుని తగ్గించుకుంది. తాజాగా రెండవసారి వైరస్ బారిన పడటం సంచలనంగా మారింది. అయితే ప్రగ్యాకి కరోనా సోకడంతో అఖండ టీమ్ కి టెన్షన్ పట్టుకుంది.
మరి అఖండ షూటింగ్ పూర్తయిందిగా? వాళ్లకెందుకు టెన్షన్ అంటే ఆసక్తికర సంగతే ఉంది. నాలుగు రోజులు క్రిత అఖడం షూటింగ్ పూర్తవ్వడంతో టీమ్ అంతా పార్టీ చేసుకుంది. ఇందులో నటసింంహ బాలకృష్ణ కూడా ఉన్నట్లు తెలుస్తోంది. బాలయ్యతో పాటు ఇంకా సినిమాకు పనిచేసిన కీలక సభ్యులు సహా చాలా మంది ఉన్నారు. దీంతో వాళ్లంతా ఇప్పుడు కరోనా పరీక్షలు తప్పక చేయించుకోవాల్సిన ఆవశ్యకత ఏర్పడింది. కరోనా సెకెండ్ వేవ్ ఎంత ఉదృతంగా కొనసాగిందో చెప్పాల్సిన పనిలేదు. వైరస్ బారిన పడి ప్రాణాలతో చెలగామడాల్సిన పరిస్థితులు. ఈ నేపథ్యంలో ఎక్కడి షూటింగ్ లు అక్కడే నిలిచిపోయాయి.
ప్రస్తుతం పరిస్థితులు అదుపులోకి వచ్చాయి. అయినా కరోనా పట్ల జాగ్రత్తగా ఉండాలని ఎప్పటికప్పుడు కేంద్రం హెచ్చరికలు జారీ చేస్తూనే ఉంది. ఇక `అఖండ` చిత్రానికి మాస్ డైరెక్ట్ బోయపాటి శ్రీను దర్శకత్వం వహిస్తున్నారు. ద్వారకా క్రియేషన్స్ పతాకంపై మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మిస్తున్నారు. గతంలో బోయపాటి-బాలయ్య కాంబినేషన్ లో తెరకెక్కిన `సింహ`..`లెజెండ్` చిత్రాలు భారీ విజయాలు సాధించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో `అఖండ`తో హ్యాట్రిక్ కొట్టాలని ఈ ద్వయం కసిగా పనిచేస్తోంది.