Begin typing your search above and press return to search.

ఫోటోస్టోరి: బొద్దు భామ సన్నజాజి వేషాలు

By:  Tupaki Desk   |   16 July 2015 7:38 PM GMT
ఫోటోస్టోరి: బొద్దు భామ సన్నజాజి వేషాలు
X
స్వాతంత్య్ర సమరయోధుడు భగత్‌సింగ్‌, తాంతియా తోపేల్ని గుర్తు చేస్తోంది దూ ఈ భామ. వీరత్వంలో భగత్‌సింగ్‌కి చెల్లెలులాగా, తలకట్టులో తాంతియా తోపే మేనత్తలాగా తలపాగా చుట్టింది. రాజస్థానీ స్టయిల్‌లో కనిపించి కవ్వింతకు దిగింది. అంతేనా రాజస్థాన్‌ వ్యాపారుల మాదిరిగానే రూపురేఖల్ని ఆవిష్కరించింది. దేహమంతా మెటాలిక్‌ ఆభరణాల్ని చుట్టేసింది. ఆ చేతికి వీరులు ధరించే కంకణం, ఆ మెడలో పొదుగుల హారం, వేలికి వజ్రపు ఉంగరం.. సుల్తానుల కాలం నాటి వైభవం అంతా కనిపిస్తోంది. ఇంతకీ మన చబ్బీ బ్యూటి పరిణీతి చోప్రాకు ఏమైయుంటుందంటారు?

అసలు ఈ దివ్యరూపం చూశాక.. అభిమానుల్లో ఓ కొత్త కంగారు పుట్టుకొచ్చింది. అసలు ఈవిడ పరిణీతియేనా? మునుపటి రూపం ఏదీ? ఏమైంది? అంటూ ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తున్నారు. నమిత, సోనాక్షిలా బొద్ధుగా కనిపించే ఈ అమ్మడు ఇలా ఉన్నట్టుండి రూపం మార్చుకుని షాకిస్తోంది. ఇంతకాలం బొద్దుతనం వల్ల అందాల్ని ఆవిష్కరించడం వీలుపడలేదు. కానీ ఇప్పుడు ఆ సమస్యే లేదు. బికినీలు, టూపీస్‌లకు ఇక రెడీ అయిపోవచ్చు. ఆ బొద్దుతనం పోయింది కాబట్టి, పరికిణీలో సన్నజాజి అందాల్ని ఆవిష్కరించవచ్చు. సొట్టబుగ్గలతో చిరునవ్వులూ చిందించవచ్చు. అందుకే ఇలా మురిసిపోతోందిలా.