Begin typing your search above and press return to search.
దర్శకేంద్రుని సన్ ఈసారైనా?
By: Tupaki Desk | 13 Oct 2018 3:30 AM GMTదర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు తనయుడు ప్రకాశ్ కోవెలమూడి ప్రస్తుతం ఏం చేస్తున్నారు? `సైజ్ జీరో` తర్వాత బిగ్ గ్యాప్ వచ్చింది కదా.. అని ప్రశ్నిస్తే... ఈ గ్యాప్ లోనే వైఫ్ కనిక థిల్లాన్ తో కలిసి ఓ అదిరిపోయే స్క్రిప్టును రెడీ చేసుకున్నారాయన. ఆ క్రమంలోనే కంగన రనౌత్ లాంటి స్టార్ హీరోయిన్ ని ఒప్పించి బాలీవుడ్ లో `మెంటల్ హై క్యా` అనే చిత్రాన్ని ప్రారంభించారు. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ సాగుతోంది. ఇదివరకూ రిలీజ్ చేసిన పోస్టర్లలో కంగన - రాజ్ కుమార్ రావ్ వెరైటీ లుక్స్ ఆకట్టుకున్నాయి. కంగన ఈ చిత్రంలో ఓ ప్రయోగాత్మక పాత్రలోనూ నటిస్తోంది.
ఇంతకీ ఈ సినిమా రిలీజ్ ఎప్పుడు? అంటే.. 22 ఫిబ్రవరి 2019 అని ప్రకటించారు. కానీ ఇప్పుడు మరో నెలరోజుల పాటు వాయిదా వేసారని తెలుస్తోంది. యాక్షన్‌స్టార్ అజయ్ దేవగన్ - రకుల్ ప్రీత్ జంటగా నటించిన `దే దే ప్యార్ దే` (ఇవ్వు ఇవ్వు ప్రేమ ఇవ్వు) చిత్రం అదే తేదీకి రిలీజ్ కి వస్తోంది. ఆ క్రమంలోనే సోలో రిలీజ్ కోసం మార్చి 29 నాటికి ఈ చిత్రాన్ని వాయిదా వేశారని తెలుస్తోంది. అదే రోజు కృతి సనన్ - కార్తిక్ ఆర్యన్ జంటగా నటించిన `లుకా చుప్పీ` చిత్రం రిలీజవుతోంది.
అదంతా అటుంచితే.. టాలీవుడ్ లో ప్రకాశ్ కోవెలమూడి ఆశించిన స్థాయిలో రాణించలేకపోయారు. అయితే బాలీవుడ్ ప్రయత్నం ఈసారి సక్సెసవుతుందా? అంటూ ఆసక్తికర చర్చ మొదలైంది. `మెంటల్ హై క్యా `చిత్రానికి ప్రకాశ్ వైఫ్ కనికా దిల్లాన్ కథ అందించారు. తనో మంచి రచయిత.. ఇటీవలే బ్లాక్‌బస్టర్ `మన్మార్జియాన్`కి స్క్రిప్టు అందించింది కూడా కనికనే. అంతేకాదు.. బాలీవుడ్ బాద్ షా షారూక్ నటించిన `రా-వన్`కి స్క్రిప్టు ఇచ్చింది కనిక థిల్లాన్.. అంత ట్యాటెంటు ఉన్న కనిక తన హబ్బీ ప్రకాశ్ తెరకెక్కిస్తున్న తాజా చిత్రానికి స్క్రిప్టు అందించారు కాబట్టి కనీసం ఈసారైనా ఆశించిన సక్సెస్ వస్తుందా? అంటూ వేచి చూస్తున్నారంతా. వైఫ్& హజ్బెండ్ శ్రమించిన `సైజ్ జీరో` పరాజయం పెద్ద డ్రాబ్యాక్ అయినా కనీసం బాలీవుడ్‌లో అయినా ప్రకాష్ సత్తా చాటుతారా.. అన్న ఆసక్తికర చర్చ సాగుతోంది. ప్రయోగాత్మక స్క్రిప్టులతో సక్సెస్ అందుకుంటున్న సీజన్ ఇది. ప్రకాశ్ ప్రయత్నం ఫలిస్తుందేమో చూడాలి.