Begin typing your search above and press return to search.
సీసీ ఫుటేజ్ పరిశీలించిన ప్రకాష్ రాజ్ ఏమన్నాడంటే?
By: Tupaki Desk | 20 Oct 2021 10:30 AM GMTటాలీవుడ్ మూవీ ఆర్టిస్టు అసోసియేష్ (మా) ఎన్నికలు జరిగి 10 రోజులవుతున్నాయి. కానీ ఆరోజు నెలకొన్న వివాదం ఇప్పటికీ సమసి పోలేదు. ఈ ఎన్నికల్లో పరాజయం చెందిన ప్రకాశ్ రాజ్ తో పాటు ఆయన ప్యానెల్లో పోటీ చేసిన సభ్యులు మంచు విష్ణు ప్యానెల్ పలు ఆరోపణలు చేశారు. ఎన్నికల్లో మంచి విష్ణు ప్యానెల్ సభ్యులు అవకతవకలకు పాల్పడ్డారని అన్నారు. అయితే మొదట తాను మా అసోసియేషన్ సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించినా ఆయన రాజీనామాన్ని విష్ణు పాలకవర్గం ఆమోదించలేదు. దీంతో ఆయన ఎలక్షన్ జరిగిన రోజు సీసీ పుటేజ్ కావాలని డిమండ్ చేశారు. అయితే అందుకు అభ్యంతరం లేదని విష్ణు తెలిపినా ఎలక్షన్ అధికారి మాత్రం తన వ్యాఖ్యలకు స్పందించలేదని అంటున్నారు.
తాజాగా ఆయన సీసీ పుటేజీ పరిశీలించడానికి వెళ్లేముందు మీడియాతో మాట్లాడారు. ‘ఎలక్షన్ జరిగిన తీరుపై నాకు, నాతోటి ఉన్న సభ్యులకు కొన్ని అనుమానాలున్నాయి. అవి తీర్చడానికి మాకు ఆరోజు పెట్టిన సీసీ పుటేజీ కావాలి. కొత్తగా ఎన్నికైన విష్ణు పాలకవర్గం మీద మాకు ఎలాంటి కక్ష లేదు. వారి పని వారు చేయనివ్వండి. అయితే మాకు సీసీ పుటేజీ కావాలన్నప్పుడు ఎలక్షన్ ఆఫీసర్ స్పందించకుండా మీడియా సమావేశం నిర్వహించారు. ఆ తరువాత కోర్టు ద్వారా రావాలని అంటున్నారు. ఇలా ఎందుకు అంటున్నారో అర్థం కావడం లేదు’ అని అన్నారు.
ఈనెల 10న ‘మా’ ఎలక్షన్ ప్రక్రియలో పలు నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఓ వైపు ఎలక్షన్ జరుగుతుండగానే మరోవైపు పోటీ దారుల మధ్య చిన్నపాటి ఘర్షణ వాతావరణం నెలకొంది. ఈసీ మెంబర్ గా పోటీ చేస్తున్న హేమ, శివబాలాజీ చేయి కొరికింది. అటు అసోసియేషన్ కు సంబంధం లేని వ్యక్తి ఓటు వేస్తున్నారని తెలిసి విష్ణు ప్యానెల్ కు చెందిన వారు అతన్ని బయటకు పంపారు. ఇకబెనర్జీ, మోహన్ బాబుల మధ్య మాటల యుద్ధం సాగింది. అయితే తరువాత ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మోహన్ బాబు తనను బూతులు తిట్టారని బెనర్జీ ఆరోపించారు. ఇక ఎన్నిక ప్రక్రియ పూర్తయిన తరువాత కౌంటింగ్లో నూ ఆశ్చర్యకర సంఘటనలు చోటు చేసుకున్నాయి.
మోహన్ బాబు, మురళీ మోహన్ పర్యవేక్షణలో ఎలక్షన్ కౌంటింగ్ నిర్వహించగా ఇరు ప్యానెల్ సభ్యులు కొంచెం దూరంలోనే ఉన్నారు. అయితే కొందరు గెలిచినట్లే గెలిచి ఓడిపోయారని ప్రకటించారు. అనసూయ రాత్రి వరకు గెలిచిందని ప్రచారం సాగగా.. ఉదయం ఓటమి చెందిందని తెలిపారు. దీంతో ఎలక్షన్ కౌంటింగ్లో తమకు చాలా అనుమానాలున్నాయని ప్రకాశ్ రాజ్ ప్యానెల్ ఆరోపిస్తోంది. మాకు ఎన్నికల లెక్కింపులో ఉన్న అనుమానాలు తీర్చాలని డిమాండ్ చేస్తున్నాం. వాటిని తీర్చలేరా..? అని ప్రశ్నించారు.
అయితే సీసీ పుటేజ్ చూపించడానికి మాకెలాంటి అభ్యంతరం లేదని విష్ణు తెలిపారు. కానీ ఎలక్షన్ అధికారి మాత్రం ప్రొటోకాల్ ఉంటుందని, దాని ప్రకారం చూపిస్తామన్నారు. అంతేకాకుండా కోర్టు ద్వారా వస్తే కచ్చితంగా చూపిస్తామన్నారు. ఎలక్షన్ అఫీసర్ ను మీము నేరుగా సీసీ పుటేజీ అడిగితే ఆయన మీడియా సమావేశం నిర్వహించారని, ఏవేవో కారణాలు చెబుతున్నారని ఆరోపించారు. మాకు సీసీ పుటేజీ చూపిస్తే దాని ప్రకాం ఏం చేస్తామో చెబుతామని ప్రకాశ్ రాజ్ చెబుతున్నారు. ఇదిలా ఉండగా ప్రకాశ్ రాజ్ తో పాటు 11 మంది సభ్యుల రాజీనామాలను విష్ణు ప్యానెల్ ఆమోదించలేదు. అయితే సీసీ పుటేజీ తరువాత ఎలాంటి పరిణామాలుంటాయోనని సినీ ఇండస్ట్రీకి చెందిన వారు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.