Begin typing your search above and press return to search.
దీపికా పదుకొణే బికినీపై ప్రకాష్ రాజ్ ఏమన్నారంటే?
By: Tupaki Desk | 16 Dec 2022 7:05 AM GMTబాలీవుడ్ నటి దీపికా పదుకొణే బికినీ రచ్చ ఏ రేంజ్ లో జరుగుతోందో చెప్పాల్సిన పనిలేదు. 'పఠాన్' నుంచి దీపికా పదుకొణే బికినీ సాంగ్ రిలీజ్ కాగానే రచ్చంతా బికినీపైనే నడుస్తోంది. మొదట్లో బికినీలో దీపిక అందాల ఆరబోతపై చర్చ సాగింది. అటుపై ఆ చర్చ రాజకీయంగా దారి తీసింది.
దీపిక ధరించిన బికినీ రంగు బీజేపీ పార్టీ కాషాయ రంగు అంటూ చర్చకు రావడంతో సీన్ మరింత రసవత్తరంగా మారింది. దీపిక అందాల ఆరబోత పక్కకు పోయి..మా పార్టీ రంగు ఉన్న వస్ర్తాన్ని ధరిస్తావా? ఎంత దైర్యం అంటూ కాషాయ వీరులంతా దూసుకొచ్చారు.
ఇప్పటికే మధ్యప్రదేశ్ హోమ్ మినిస్టర్ వార్నింగ్ కూడా ఇచ్చారు. ఆ బికినీ సన్నివేశాలు తొలగిస్తే సినిమా ఎంపీలో రిలీజ్ అవుతుందని..లేకపోతే తాను ఏం చేయాలో అదే చేస్తానని పబ్లిక్ గానే హెచ్చరించారు. ఇదే సమయంలో పెళ్లైన హీరోయిన్ ఇలా బికినీ లు ధరించడమే గాకుండా హీరోతో ఆ రేంజ్ లో రొమాన్స్ అవసరామా? అంటూ నెటి జనులు ఆగ్రహానికి గురయ్యారు.
ఎవరి స్టైల్లో వాళ్లు కామెంట్లు పెట్టారు. చివరికి షారుక్ ఖాన్ పోస్టర్లు సైతం రోడ్లపై నిప్పంటించారు. ఓ న్యాయవాది మరో అడుగు ముందుకేసి ఏకంగా దీపికపై పోలీస్ కేసు పెట్టారు. అయినా వీటిని ఉయ్ డోంట్ కేర్ అంటూ దీపికా..షారుక్ అండ్ కో అంతే వేగంగా ముందుకెళ్తుంది. అయితే ఈ బికినీ డిజైన్ చేసిన డిజైన్ మాత్రం వివరణ ఇచ్చారు. ' ఇది కాషాయ రంగు కాదు. కాలిన నారింజ రంగు అని క్లారిటీ ఇచ్చారు. అయిన సరే ఎవ్వరూ తగ్గడం లేదు.
ఈ నేపథ్యంలో తాజాగా దీపిక పదుకొణే కి విలక్షణ నటుడు..రాజకీయ నాయకుడు ప్రకాష్ రాజ్ మద్దతుగా నిలిచారు. 'అసహ్యకరమైనది ... మనం ఇంకెంత కాలం ఈ ..రంగు గుడ్డి #ఆంధ్భక్తలను సహించాలి .. #justasking' అంటూ ధీటుగానే స్పందించారు.
ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు నెట్టింట జోరుగా వైరల్ అవుతున్నాయి. ప్రకాశ్ రాజ్ వ్యాఖ్యలకు ఎలాంటి బధులైనా రావచ్చు. దేశంలో కొన్ని పార్టీలు ఆయనకు మద్దతుగా..బిజేపీ మద్దతుదారులు ఆయనకు వ్యతిరేకంగానూ చర్చకు తెర తీసే అవకాశం ఉంది.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.