Begin typing your search above and press return to search.
ప్రకాష్ రాజ్ కూడా పవన్ ని సమర్ధించలేదేంటీ?
By: Tupaki Desk | 28 Sep 2021 2:58 AM GMTస్టార్ హీరో.. జనసేనాని పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఇటీవల `రిపబ్లిక్` చిత్రానికి సంబంధించిన ఫంక్షన్ లో ఏపీ ప్రభుత్వంపై.. మంత్రులపై తీవ్ర విమర్శలు చేసిన విషయం తెలిసిందే. పవన్ చేసిన వ్యాఖ్యలు ఇండస్ట్రీలో తీవ్ర దుమారాన్ని సృష్టించాయి. అయితే ఈ విషయంలో పవన్ కు మద్దతుగా నిలవడానికి ఏ ఒక్కరూ సహసించడం లేదు. చివరికి పవన్ మద్దుతుగా మాట్లాడిన ప్రకాష్ రాజ్ కూడా సోమవారం `మా` అధ్యక్ష పదవి కోసం నామినేషన్ వేసిన ప్రకాష్ రాజ్ ఆచితూచి స్పందించాడు.
ప్రతి విషయాన్ని కుండబద్దలు కొట్టినట్టు మాట్లాడే ప్రకాష్ రాజ్.. తనకు మద్దతుగా నిలిచిన పవన్‌కల్యాణ్ ని సమర్ధించకుండా తప్పించుకునే ప్రయత్నం చేయడం గమనార్హం. సోమవారం తన ప్యానెల్ సభ్యులతో కలిసి నామినేషన్ దాఖలు చేసిన ప్రకాష్ రాజ్ ఆ తరువాత మీడియాతో మాట్లాడారు. ఇవి రాజకీయ ఎన్నికలు కాదని పోటీ మాత్రమేనని స్పష్టం చేశారు. గెలిపించేది.. ఓడించేది ఓటర్లే అని చెప్పారు. అయితే ఈ సందర్భంగా పవన్ చేసిన విమర్శలపై ప్రకాష్‌రాజ్ స్పందించిన తీరు పలువురికి ఆశ్చర్యాన్ని కలిగించింది.
పవన్ ఓ రాజకీయ నాయకుడు.. దేశం కోసం పోరాడుతున్నాడు..ఆయనొక మంచి నాయకుడు.. అతని కంటూ కొన్ని సిద్ధాంతాలున్నాయి. పవన్ `మా` సభ్యుడే అని తెలిపారు. అయితే ఎవరు ఎన్ని చెప్పినా ఆయన మంచి కోసమే మాట్లాడతారని.. పవన్ చేసిన వ్యాఖ్యలు దాని ప్రతిఫలాన్ని బట్టి ముందుకు వెళతామని ఈ సందర్భంగా స్పష్టం చేశారు. ప్రతి ఒక్కరిలోనూ ప్రేమ.. ఆవేశం వుంటాయని.. వాళ్లని మాట్లాడనివ్వాలని ప్రకాష్ రాజ్ కోరారు. తన ప్యానెల్ లక్ష్యం అభ్యుదయమేనని తెలిపిన ప్రకాష్ రాజ్ రాజకీయ వ్యాఖ్యలపై దయచేపి ఎవరూ ప్రశ్నించవద్దని ప్రకాష్ రాజ్ కోరడం ఆసక్తికరంగా మారింది.
సూటిగా ప్రశ్నిస్తూ మాట్లాడే ప్రకాష్ రాజ్ ఇలా డిప్లమాటిక్ గా మాట్లాడటం ఏంటని అంతా ఆశ్చర్యపోతున్నారు. తాను ఏం మాట్లాడినా అది `మా` ఎన్నికలపై ప్రభావం చూపుతుందన్న ఆందోళన ప్రకాష్ రాజ్ మాటల్లో స్పష్టంగా కనిపించిందని ఇండస్ట్రీ వర్గాల్లో చర్చ నడుస్తోంది. పవన్ చేసిన వ్యాఖ్యలపై స్పందించకుండా ప్రకాష్ రాజ్ ఇతర అంశాల గురించి మాట్లాడటం ఇందుకు నిదర్శనమని చెబుతున్నారు. ప్రకాష్ రాజ్ సేఫ్ గేమ్ ఆడుతున్నాడని కూడా విమర్శలు వినిపిస్తున్నాయి.