Begin typing your search above and press return to search.
ట్రెండీ టాక్: MAA భవంతికి ప్రకాష్ రాజ్ ఎకరం.. మంచు విష్ణు 30కోట్లు!
By: Tupaki Desk | 28 July 2021 7:15 AM GMTఇది నిజంగా వెరీ గుడ్ ఐడియా. శత్రువుల్ని మిత్రుల్ని చేసే గుడ్ ఐడియా. అప్పట్లో శ్రీనువైట్ల- కోన వెంకట్ ల మధ్య సయోధ్య కుదిర్చినట్టు ఈ ఇద్దరికీ సయోధ్య కుదర్చాలి. మూవీ ఆర్టిస్టుల ఎన్నికల్లో ప్రచారమంతా మా సొంత భవంతి నిర్మాణం చుట్టూనే తిరుగుతోంది కాబట్టి ఆ ఇద్దరినీ కలపాలి. ఎవరికి వారు నడిగర సంఘం తరహాలో 30 కోట్లు పెట్టి భారీగా మా అసోసియేషన్ సొంత భవంతిని నిర్మించాలని కలలు గంటున్నారు గనుక ఆ ఇద్దరికీ ఒక అవకాశం కల్పించాలి.
అయితే ఇది ప్రాక్టికల్ గా సాధ్యమేనా? దీనిని సుసాధ్యం చేయాలంటే ఏం జరగాలి? అన్నది విశ్లేషిస్తే .. గడిచిన కాలంలో అధ్యక్ష పదవి కావాలనుకుంటున్న ప్రకాష్ రాజ్ వ్యూహాలు కానీ మంచు విష్ణు వ్యూహాన్ని కానీ పరిశీలిస్తే ఒక బెటర్ ఐడియా అందరికీ తడుతోంది. ఇదేమిటి? అంటే...
ఈసారి `మా` ఎన్నికలను ఎలాంటి రభసకు ఆస్కారం ఇవ్వకుండా ఏకగ్రీవం చేయాలి. అలాగే మా అసోసియేషన్ కు ఎకరం స్థలం సంపాదించే తెలివితేటలు తనకున్నాయని ప్రభుత్వంతో అధికారులతో మాట్లాడే పరపతి తన వద్ద ఉందన్న ప్రకాష్ రాజ్ ని తెలివిగా సద్వినియోగం చేయాలి. తెరాస అధినేతలతో అసోసియేషన్ కి స్థలం సంపాదించే పనిని ఆయనకు అప్పగించాలి. అలాగే మా బిల్డింగ్ కి ఎవరి వద్ద నుంచి అణా పైసా అయినా తీసుకోనని తన సొంత డబ్బుతోనే నిర్మిస్తానన్న మంచు విష్ణు భవంతికి అవసరమయ్యే మొత్తం నిధిని సమకూర్చమని అడగాలి.
ఇప్పుడు ఆ ఇద్దరినీ కలిపి రెండేళ్లకు చెరో ఏడాది అధ్యక్షుడు అయ్యేలా ప్లాన్ ని రీడిజైన్ చేయాలి. ఆ ఇద్దరినీ క్రమశిక్షణా కమిటీ మానిటర్ చేస్తూ ఎలాంటి వివాదాలు లేకుండా మా సొంత భవంతి నిర్మాణం పూర్తయ్యేలా చేయాలి. 2021-23 సీజన్ కి పదవుల పంపకం సాగాలి. ఈసీ సభ్యులను క్రమశిక్షణా సంఘం ఎన్నుకోవాలి. ఇద్దరు అధ్యక్షులతో పాలనను విభజించడం ద్వారా ఒకే దెబ్బకు రెండు పిట్టలు పడతాయి. మా భవంతి పేరుతో అసోసియేషన్ కి 60 కోట్లు కలిసొచ్చినట్టేనన్న చర్చా వేడెక్కిస్తోంది. తమిళ తంబీల నడిగర సంఘం భవంతిలా నిర్మించాలంటే 30 కోట్లు పెట్టాలి. అలాగే ఎకరం స్థలం హైదరాబాద్ నడిబొడ్డున కావాలంటే 30 కోట్లు పైమాటే. అది కూడా సంఘంలో ఎవరూ డబ్బు ఇవ్వకుండా ఆ ఇద్దరే చూసుకోవాలి ఇదంతా!! ఈ ఐడియా భేషుగ్గా ఉందంటూ 950 మంది మా అసోసియేషన్ సభ్యులు కూడా ఒప్పుకుని తీరతారేమో!!
ప్రతిష్ఠ నిలబడాలంటే...!
మూవీ ఆర్టిస్టుల సంఘం (మా) భవంతి నిర్మాణం జరగడమే ఈసారి అందరి ధ్యేయం కావాలి. టాలీవుడ్ 90ఏళ్ల హిస్టరీలో మునుపెన్నడూ లేనిది ఈసారి జరగాలి. ఎకరం స్థలం దక్కాలి. 30 కోట్లతో భవంతి నిర్మాణం పూర్తవ్వాలి. అప్పుడే టాలీవుడ్ ఆత్మ శాంతిస్తుంది! లేదంటే ఎన్నో ఆత్మల ఘోష అలానే ఇండస్ట్రీ చుట్టూ ధ్వనిస్తూ పెను ప్రకంపనంలా మారుతుంది.
పెద్దలంతా తలో చెయ్యేస్తే..!
కేవలం భవంతి నిర్మిస్తే సరిపోదు.. నడిగర సంఘం భవంతిని కొట్టేలా ఇంటీరియర్ భారీగా డిజైన్ చేయించాలి. టాలీవుడ్ గౌరవాన్ని అంతర్జాతీయ సినీవేదికపై నిలబెట్టేంతగా బాలీవుడ్ ని కొట్టేస్తాం అనిపించేలా ఈ భవంతి డిజైన్ అదిరిపోవాలి. దీనికోసం కోట్లు ఖర్చవుతుంది గనుక సినీపెద్దలంతా తలో చెయ్యేస్తే కోట్లు పోగవ్వడం ఏమంత కష్టం కాదు. ఇక నటసింహా నందమూరి బాలకృష్ణ వంటి వారు విరివిగా భూరి విరాళాలు ఇచ్చేందుకు ఎప్పుడూ సిద్ధంగా ఉన్నారు. కమిటీ పెద్దల విరాళాలు సహా మా ఆర్టిస్టుల్లో ధనికులంతా తలో చెయ్యి వేస్తే ఆ రేంజులో మా అసోసియేషన్ భవంతి రెడీ అవుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు. ఎవరి సాయమూ లేకుండా కేవలం ఇండివిడ్యువల్స్ ఏఎంబీ సినిమాస్.. ఏఏఏ సినిమాస్ నిర్మించేస్తుండగా అంత పెద్ద అసోసియేషన్ వాళ్లంతా కలిసి ఒక్క భవంతిని నిర్మించుకోలేరా...!!