Begin typing your search above and press return to search.

మహర్షి కి వాళ్ళే అమ్మా నాన్న!

By:  Tupaki Desk   |   29 Aug 2018 1:05 PM IST
మహర్షి కి వాళ్ళే అమ్మా నాన్న!
X
సూపర్ స్టార్ మహష్ బాబు ప్రస్తుతం వంశి పైడిపల్లి దర్శకత్వంలో 'మహర్షి' అనే సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్.. అల్లరి నరేష్ మరో కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఇక మిగతా పాత్రలగురించి పెద్దగా సమాచారం లేదు. మహేష్ కు తల్లి పాత్రలో సీనియర్ నటి జయప్రద నటిస్తున్నారు అనే వార్తలు ఈమధ్య గుప్పుమన్నాయి. కానీ తాజా సమాచారం ప్రకారం జయప్రద ఈ సినిమాలో నటించడం లేదు.

ఎందుకంటే ఆ పాత్రలో మరో సీనియర్ నటి జయసుధ నటిస్తోందట. ఈ విషయాన్ని ఎవరో కాదు స్వయంగా జయసుధ వెల్లడించారు. ముచ్చటగా మూడో సారి మహేష్ కు తల్లిగా నటిస్తున్నానని జయసుధ తెలిపారు. అంతే కాకుండా తన పాత్రకు సంబంధించిన షూటింగ్ కూడా ఆల్రెడీ పూర్తయిందని చెప్పారు. ఈ విషయం ఇలా ఉంటే.. మహేష్ తండ్రి పాత్రలో ప్రకాష్ రాజ్ నటిస్తున్నారు. హీరో పేరెంట్స్ గా ప్రకాష్ రాజ్-జయసుధ లది సూపర్ హిట్ కాంబినేషన్. మరి ఇందులో కూడా అదే కాంబో రిపీట్ అవుతోంది.

మహేష్ కెరీర్లో ఈ సినిమా 25 వది కావడంతో అంచనాలు భారీగానే ఉన్నాయి. 'బృందావనం'.. 'ఊపిరి' లాంటి మంచి అభిరుచి కలిగిన సినిమాల దర్శకుడు వంశీ పైడిపల్లి మహేష్ ను ఎలా ప్రెజెంట్ చేస్తాడో అని అందరూ ఎదురు చూస్తున్నారు. వచ్చే ఏడాది సమ్మర్ సీజన్ లో 'మహర్షి' ప్రేక్షకుల ముందుకు రానుంది.