Begin typing your search above and press return to search.

ప్రకాష్‌ రాజ్‌ కు కొడుకు పుట్టాడు

By:  Tupaki Desk   |   3 Feb 2016 5:42 AM GMT
ప్రకాష్‌ రాజ్‌ కు కొడుకు పుట్టాడు
X
ఇప్పటికే ప్రకాష్‌ రాజ్‌ త్వరలో తండ్రి కాబోతున్నాడంటూ న్యూస్‌ ఎక్కడ పడితే అక్కడ వినిపిస్తోంది. అయితే ఈరోజు ఆ శుభవార్త రానే వచ్చింది.

నటుడు-దర్శకుడు ప్రకాష్‌ రాజ్‌ - బాలీవుడ్‌ కొరియోగ్రాఫర్‌ పోనీ వర్మ దంపతులకు ఈరోజు ఉదయం ఒక పండంటి బిడ్డ జన్మించాడు. తన మొదటి భార్యకు విడాకులిచ్చిన ప్రకాష్‌.. 2010లో పోని వర్మను రెండో పెళ్ళి చేసుకున్నాడు. అప్పటి నుండి హైదరాబాద్‌ లోనే మకాం ఉంటున్న ఈ జంటకు ఇప్పుడు మగబిడ్డ జన్మించాడు. ఈ న్యూస్‌ ను స్వయంగా ప్రకాష్‌ రాజ్‌ షేర్‌ చేశాడు. తన జీవితంలోనే ఇది ఆనందదాయకమైన క్షణం అంటూ పేర్కొన్నాడు.

మొదటి భార్య ద్వారా ప్రకాష్‌ కు.. ఇద్దరు కుమార్తెలు.. మేఘనా.. పూజ.. ఉన్నారు.