Begin typing your search above and press return to search.
ఎయిడ్స్ మీద ప్రకాష్ రాజ్ కామెడీ సినిమా
By: Tupaki Desk | 14 Oct 2015 7:38 AM GMTఎయిడ్స్ గురించి జనాలు ఎలా భయపడతారో.. ఎయిడ్స్ మీద సినిమా అన్నా అలాగే చూస్తారు. ఎందుకంటే సామాజిక స్పృహతో అవేర్నెస్ కోసమో.. సందేశాలివ్వడానికో సినిమాలు తీస్తే చూసే ఓపిక జనాలకు లేదు. కానీ ఎలాంటి సమస్యనైనా సుగర్ కోటింగ్ వేసి ఎంటర్ టైనింగ్ గా చెప్పగలిగితే జనాలు బాగానే ఆదరిస్తారు. అందుకు చాలా రుజువులే ఉన్నాయి. అందుకే మలయాళ దర్శకుడు ప్రియదర్శన్ కూడా ఇదే మార్గాన్ని ఎంచుకున్నారు. మల్లూవుడ్ లో, బాలీవుడ్ లో అద్భుతమైన సినిమాలు తీసిన ఈ లెజెండరీ డైరెక్టర్.. కొన్ని రోజుల కిందట ప్రకాష్ రాజ్ హీరోగా ఓ సినిమాకు శ్రీకారం చుట్టిన సంగతి తెలిసిందే.
ఇది ఎయిడ్స్ మీద జనాల్లో అవగాహన పెంచడానికి చేసిన సినిమా అట. అలాగని సీరియస్ గా డాక్యుమెంటరీ టైపులో ఏమీ తీయలేదని.. తనదైన శైలిలో ఫన్ జోడించి, సెటైరికల్ గా ఈ సినిమాను తీశానని ప్రియదర్శన్ చెప్పాడు. ప్రకాష్ రాజ్-ప్రియదర్శన్ కాంబినేషన్ లో ఇంతకుముందు వచ్చిన ‘కాంజీవరం’ ఓ క్లాసిక్ గా నిలిచిపోవడం.. అనేక అవార్డులు తెచ్చిపెట్టడం తెలిసిన సంగతే. ఈ సినిమాను అమలాపాల్ తో పాటు ఆమె భర్త విజయ్ కలిసి నిర్మించిన సంగతి తెలిసిందే. కేవలం 16 రోజుల్లో ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసేయడం విశేషం. త్వరలోనే ఈ సినిమా తమిళ - మలయాళ - తెలుగు - హిందీ భాషల్లో విడుదల కాబోతోంది.