Begin typing your search above and press return to search.
చిరంజీవి మద్ధతుపై ప్రకాష్ రాజ్ అలా అనేశారా?
By: Tupaki Desk | 26 Jun 2021 2:30 AM GMTమూవీ ఆర్టిస్టుల సంఘం (మా) ఎన్నికల్లో ప్రకాష్ రాజ్.. మంచు విష్ణు ప్రధాన అభ్యర్థులుగా పోటీపడుతుండగా జీవిత- హేమ వంటి వారు అధ్యక్ష పదవి కోసం పోటీకి దిగుతున్న సంగతి తెలిసిందే. ఇందులో సహజనటి జయసుధ పేరు కూడా వినిపిస్తోంది. సెప్టెంబర్ లో ఎన్నికలు జరగనుండగా సన్నివేశం రసవత్తరంగా మారుతోంది.
ఈసారి ఎన్నికల్లో మెగాస్టార్ చిరంజీవి మద్ధతు ఎవరికి? అంటూ ఎవరికి వారు ఊహాగానాలు సాగిస్తున్నారు. మెగా బ్రదర్ మద్ధతు ప్రకాష్ రాజ్ కే ఉంది కాబట్టి చిరు ఆటోమెటిగ్గా ఆయనకే అండగా నిలుస్తారన్న ప్రచారం ఉంది. కానీ చిరంజీవి దీనిని అధికారికంగా ప్రకటించలేదు. మరోవైపు మంచు విష్ణు తన మిత్రుడు మోహన్ బాబు తనయుడే కాబట్టి అతడికి చిరు మద్ధతిస్తారని కూడా ఊహాగానాలు సాగిస్తున్నారు.
సహజనటి జయసుధ పోటీ చేస్తే తనకు కూడా చిరు మద్ధతిచ్చేందుకు ఆస్కారం లేకపోలేదు. కానీ ఆయన న్యూట్రల్ గానే ఉన్నారు. ఇక చిరు తనకు మద్ధతిస్తున్నారా? అన్న ప్రశ్నకు తాజా సమావేశంలో ప్రకాష్ రాజ్ ఏం చెప్పారు అంటే.. అసలు ఇందులోకి ఆయనను ఎందుకు లాగుతున్నారు? అని ప్రశ్నించారు. మా ఎన్నికల వ్యవహారంలోకి చిరంజీవిని లాగాల్సిన అవసరం లేదని అభిప్రాయపడ్డారు. 950 మంది ఉన్న మా అసోసియేషన్ ఎన్నికల్ని మరీ ఎక్కువగా ఊహిస్తున్నారని ఆయన వ్యాఖ్యానించారు. మొత్తానికి నాగబాబు మద్ధతు ఉంది కాబట్టి చిరు తన వైపే ఉంటారని ఆయన ధీమా కావచ్చంటారా?