Begin typing your search above and press return to search.
కోలీవుడ్ లో ప్రకాష్ రాజ్ బ్యాన్..?
By: Tupaki Desk | 6 May 2019 10:38 AM GMTవిలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ తెలుగులో మాత్రమే కాకుండా తమిళంలో కూడా మంచి చిత్రాలు చేశాడు. తమిళంలో ఈయన చేసిన సినిమాలతో ఎన్నో అవార్డులను కూడా దక్కించుకున్నాడు. తమిళంలో ప్రకాష్ రాజ్ కు మంచి గుర్తింపు ఉంది. తమిళ సినిమా ఇండస్ట్రీలో ప్రకాష్ రాజ్ కు ప్రత్యేకమైన గౌరవం కూడా ఉంది. అయితే ఇప్పుడు ఆయన తమిళ ప్రజలపై విషం కక్కే విధంగా మాట్లాడాడు అని, అతడి ప్రవర్తన తమకు చాలా బాధను కలిగించిందంటూ తమిళ జనాలు ఆక్రోశం వ్యక్తం చేస్తున్నారు. ప్రకాష్ రాజ్ పై ముఖ్యమంత్రి పళ్లని స్వామితో పాటు, పలువురు బీజేపీ నాయకులు కూడా తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తమిళ సినీ పరిశ్రమ ద్వారా చాలా సంపాదించుకున్న ప్రకాష్ రాజ్ అలాంటి వ్యాఖ్యలు చేసినందుకు గాను ఆయన్ను బ్యాన్ చేయాలనే డిమాండ్ వస్తుంది.
ఢిల్లీలో అరవింద్ కేజ్రీవాల్ పార్టీ అయిన ఆమ్ ఆద్మీకి మద్దతుగా ప్రకాష్ రాజ్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నాడు. ఆ సమయంలో ఢిల్లీలో ఎక్కువ శాతం తమిళులు చదువుతున్నారు. వారి వల్ల ఢిల్లీ స్థానికులకు అన్యాయం జరుగుతుందని సీఎం కేజ్రీవాల్ చేసిన వ్యాఖ్యలను ప్రకాష్ రాజ్ సమర్ధించాడు. ఢిల్లీ స్థానికులకు తమిళుల వల్ల అన్యాయం జరుగుతుందన్నట్లుగా ప్రకాష్ రాజ్ అన్నాడని, అదే సమయంలో తాను తమిళనాడుకు చెందిన వ్యక్తిని కాదు, కర్ణాటకకు చెందిన వ్యక్తిని అంటూ ప్రకాష్ రాజ్ చెప్పుకున్నాడు అనేది తమిళుల వాదన.
ఈ విషయమై ప్రకాష్ రాజ్ ను ప్రశ్నిస్తూ నిర్మాత ధనుంజయ్ సోషల్ మీడియాలో ఇది నిజమేనా? మీరు అలా మాట్లాడారా? మీ వ్యాఖ్యలు ఎవరో వక్రీకరించారని నేను నమ్ముతున్నాను. ఇండియాలో విద్యార్థులు ఎవరు ఎక్కడైనా చదువుకోవచ్చు. ఈ విషయంలో ఎవరు ఎలాంటి అభ్యంతరం పెట్టకూడదు. నేను ముంబయిలో చదివాను, మీరు అలాంటి వ్యాఖ్యలు చేసి ఉండరని నేను భావిస్తున్నాను అంటూ ఆయన పోస్ట్ చేశాడు. ధనుంజయ్ పోస్ట్ కు సమాధానంగా ప్రకాష్ రాజ్ స్పందిస్తూ... మీరు నన్ను నమ్ముతున్నందుకు థ్యాంక్స్. నేను అసలు అలాంటి వ్యాఖ్యలు చేయలేదు. ఎవరో కావాలని నా గురించి ఇలాంటి వ్యాఖ్యలు, పుకార్లు ప్రచారం చేస్తున్నారు. కొందరు రాజకీయాల కోసం దిగజారి మరీ ఇలా నాపై కక్ష సాధించేందుకు య్రతిస్తున్నట్లుగా ప్రకాష్ రాజ్ సోషల్ మీడియా ద్వారా తనపై వస్తున్న విమర్శలకు రియాక్ట్ అయ్యాడు. మరి ప్రకాష్ రాజ్ ను బ్యాన్ చేయాలనే విషయమై తమిళ సినీ జనాలు ఎలాంటి నిర్ణయాన్ని తీసుకుంటారనేది చూడాలి.