Begin typing your search above and press return to search.
ఓపెన్ హార్ట్: మోహన్ బాబుపై ప్రకాష్ రాజ్ బరస్ట్
By: Tupaki Desk | 18 Oct 2021 5:51 AM GMTమూవీ ఆర్టిస్టు అసోసియేషన్ (మా) ఎన్నికలు ఈనెల 10న జరిగాయి. టాలీవుడ్ ఇండస్ట్రీలోనే ఎన్నడూ లేనంతగా రసరవత్తంగా ఈ ఎన్నికలు జరిగాయి. రాజకీయ ఎన్నికలు తలపించేలాగా రెండు వర్గాల మధ్య పోటీ జరగడంతో ఇండస్ట్రీలో ఆసక్తి నెలకింది. అధ్యక్ష స్థానానికి మంచు విష్ణు, ప్రకాశ్ రాజ్ పోటీ చేయగా 101 ఓట్లతో మంచు విష్ణు గెలుపొందారు. అయితే ప్రకాశ్ రాజ్ ఓటమి తరువాత ‘మా’ అసోసియేషన్ సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఆయన బాటలోనే తన ప్యానెల్ లో గెలిచిన వారు సైతం 11 మంది తమ సభ్యత్వాన్ని వదులుకుంటన్నట్లు ప్రకటించారు. ఈ సందర్భంగా ప్రకాశ్ రాజ్ ఇప్పటి నుంచే ఇక అసలు పోరు మొదలైందని అంటున్నారు.ఈ సందర్భంగా ఆయనో ఓ చానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు ఆసక్తి విషయాలను వెల్లడించారు.
‘మా అసోసియేషన్ ఎన్నికల్లో ఎన్నో అవకతవకలు చోటు చేసుకున్నాయి. ముఖ్యంగా పోస్టల్ బ్యాలెట్ ఓట్లలో అక్రమాలు జరిగినట్లు నేను పట్టుకున్నా దానిపై ఎవరూ చర్యలు తీసుకోలేదు. ఇక ఎన్నికల్లో చాలా మంది ఇన్ యాక్టివ్ పర్సన్స్ ఎక్కువగా ఉన్నారు. జెనీలియా లాంటి వారికి టాలీవుడ్ ఇండస్ట్రీలో ఉన్న సమస్యల గురించి తెలుసా..? ఆమె ఇక్కడ ఎవరు అవసరం అని నిర్ణయించుకోగలదా..? మరికొందరు తెలుగు కూడా రాని వాళ్లు ఇక్కడికి వచ్చి ఓటు వేశారు. 1981 నుంచి టాలీవుడ్ ఇండస్ట్రీలో ఉంటున్నా.. నన్ను మాత్రం తెలుగువాడు కాదంటున్నారు.’ అని అన్నారు.
‘టాలీవుడ్ ఇండస్ట్రీలో రెండో అసోషియేషన్.. అవసరాన్ని భట్టి ఏర్పడుతుంది. ఇప్పుడు ‘మా’ సభ్యులు మారాలి. మారకపోతే కొత్త అసోసియేషన్ రావచ్చు. మొన్న జరిగిన ఎన్నికల్లో నేను ఓడిపోయానని అస్సలు అనుకోవడం లేదు. జీవితంలో గమ్యం సాధించాలంటే లక్ష్యాన్ని ఏర్పరుచుకోవద్దు.. ఓడిపోయాననని నాకు నేను అవమానపడడం లేదు. ఎందుకంటే నేను పావును కాదు. పెద్దరికాన్ని ప్రశ్నించేటప్పుడు ఇలాంటివి ఎన్నో జరుగుతూనేఉంటాయి. ’
‘మూవీ ఆర్టిస్టు అసోసియేషన్ అంతా కుటుంబం లాంటిదని అనేవాళ్లను నమ్మకూడదు. అలా అనేవారు ఎన్నికలు ఎందుకు తీసుకురావాలి..? ఇన్ని సంవత్సరాలుగా కటుుంబ సభ్యుల్లా ఉన్నవారు ఏం చేశారు..? ఇలా కుటుంబం అనే వాళ్లతో జాగ్రత్తగా ఉండాలి. వెనుకాల ఎవరుండాలో వాళ్లే ఉండాలి.. అయితే మన వెనుకున్నవాళ్లను ఎప్పటికీ నమ్మొద్దు..వారు రకరకాల రూపంలో వస్తుంటారు.. ఇలాంటి వారి వల్ల యుద్ధాలు కూడా రావచ్చు’
‘నాకు రాజకీయంగా ఎవరూ సపోర్టు చేయలేదు. ఎందుకంటే వారికున్న పనులను విడిచిపెట్టి ఈ ఎన్నికల కోసం శ్రమ పెట్టాల్సిన అవసరం లేదు. కేసీఆర్, కేటీఆర్ నాతో చనువుగా ఉంటారు. కానీ ఈ ఎన్నికల్లో వారి సపోర్టు తీసుకుంటే నా మెచ్యూరిటీ తగ్గినట్లే కదా.. వాస్తవానికి గత ఎన్నికల్లోనే నేను పోటీ చేద్దామనుకున్నా. కానీ కుదరలేదు.’
‘మా సభ్యత్వానికి రాజీనామా చేసినా సమస్యలపై ప్రశ్నిస్తా.. ఇండస్ట్రీలో ఉన్న వాళ్లకు ఏదో రకంగా న్యాయం చేయాలనే పోటీలో నిల్చున్నాను. కొన్ని కారణాల వల్ల ఓడిపోయాను. అయినంత మాత్రాన ఇండస్ట్రీ నుంచి వెళ్లిపోను. సమస్యలు ఎక్కడంటే అక్కడ నిలదీసే హక్కు నాకుంది. అవసరమనుకుంటే రాజకీయ నాయకులను కూడా ప్రశ్నిస్తా..’
‘మోహన్ బాబు ఇండస్ట్రీలో పెద్ద మనిషి. అలాంటి వ్యక్తి బెనర్జీని బూతులు తిట్టాడు. కొట్టడానికి కూడా వెళ్లాడు. ఆయనని డిస్ట్రర్బ్ చేయకపోతే ఏం లేదు. కానీ ఆయనను డిస్ట్రర్బ్ చేస్తే పది మంది వెనకాల ఉంటే కొట్టేస్తాడు. ఇండస్ట్రీలో అయన ఒక్కరే అలా ఉన్నారని అంటున్నారు. అయితే ఇంతలా భయపెట్టుకుంటే అసోసియేషన్ ఎలా నడుస్తుందోని కొందరు అనుకుంటున్నారు..?’