Begin typing your search above and press return to search.
'ఆత్మ' ఏర్పాటు పై ప్రకాష్ రాజ్ క్లారిటీ.. సరికొత్త గేమ్ ప్లాన్ తో..!
By: Tupaki Desk | 12 Oct 2021 1:52 PM GMT'మా' ఎన్నికల పోలింగ్ రోజు చోటు చేసుకున్న విషయాలను వెల్లడిస్తూ ప్రకాష్ రాజ్ ప్యానెల్ సంచలన నిర్ణయం తీసుకుంది. మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ లో జరిగిన పరిణామాలపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ ప్రకాష్ రాజ్ ప్యానల్ నుంచి గెలుపొందిన 11 మంది అభ్యర్థులు మూకుమ్మడిగా రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ఇప్పటికే అధ్యక్షుడిగా బరిలోకి దిగి ఓటమిపాలైన ప్రకాశ్ రాజ్ 'మా' ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే.
ఇదిలా ఉంటే 'మా' లో అసమ్మతి వర్గం అంతా కలిసి పోటీగా ATMAA (ఆల్ తెలుగు మూవీ ఆర్టిస్ట్ అసోసియేన్ - ఆత్మ) పేరుతో మరో అసోసియేషన్ ఏర్పాటు చేసే ఆలోచనలో ఉన్నారని ఊహాగానాలు వినిపించారు. ప్రకాష్ రాజ్ ప్యానల్ ప్రెస్ మీట్ లో ప్రకటన వస్తుందని ప్రచారం జరిగింది. ఈ నేపథ్యంలో తాజాగా మీడియా సమావేశంలో ప్రకాష్ రాజ్ దీనిపై క్లారిటీ ఇచ్చారు. కొత్త అసోసియేషన్ మొదలు పెట్టే ఆలోచన ఏదీ లేదని తెలిపారు.
ప్రకాశ్ రాజ్ మాట్లాడుతూ.. ''ఆత్మ.. పరమాత్మ.. ప్రేతాత్మ అని ఏదో మొదలు పెడతామని వార్తలు వచ్చాయి. అలాంటి ఆలోచనేదీ లేదు. 'మా' అసోసియేషన్ సమస్యలపై స్పందించటానికే నేను వచ్చాను. అవసరమైతే 'మా' లో ఉన్న వాళ్లతో కలిసి పనిచేస్తాం కానీ 10మందిని తీసుకునిపోయి కొత్త అసోసియేషన్ పెట్టే ఆలోచన లేదు. ఓడినా, గెలిచినా నేను ప్రశ్నిస్తూనే ఉంటా. ప్రతీ నెలా నా డార్లింగ్ విష్ణును చేశావా? లేదా? అంటూ అడుగుతూనే ఉంటా. మీరు చేసే పనిలో మేం అడ్డుపడం. కానీ పనిచేయకపోతే తప్పకుండా ప్రశ్నిస్తాం. అక్కడ ఉంటే 11 మందిమే ప్రశ్నించడానికి ఉంటాం.. బయటకి వస్తే వంద మందిమి ప్రశ్నిస్తామని సభ్యులు తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు'' అని అన్నారు. వేరు కుంపటి పెట్టడం లేదని ప్రకాష్ రాజ్ చెప్పినప్పటికి.. తన ప్యానల్ నుంచి గెలిచిన సభ్యులతో రాజీనామాలు చేయించి సరికొత్త గేమ్ ప్లాన్ తో ముందుకు వెళ్తున్నారని అర్థం అవుతోంది.
ఇకపోతే ప్రకాష్ రాజ్ ప్యానల్ రాజీనామా చేసిన నేపథ్యంలో ఓ నోట్ రిలీజ్ చేశారు. ''ఏ సంస్థ అయినా నిర్మాణాత్మకంగా ముందుకు వెళ్లాలంటే అందరి ఆలోచనలు, ఆచరణలు.. ఒకేలా ఉండటం అవసరం. అప్పుడే సంస్థ సజావుగా, ఆరోగ్యంగా, సభ్యుల శ్రేయస్సు దిశగా నడిచే అవకాశం ఉంటుంది. గత రెండేళ్లలో నరేష్ గారు 'మా' అధ్యక్షులుగా ఉన్న సమయంలో, తానే వ్యక్తిగత నిర్ణయాలు తీసుకోవడం, అంతా తానే అయ్యి, 'మా' కోసం ఏ పనీ జరగనివ్వని స్థితికి తీసుకువచ్చారు. జరిగిన గొప్ప పనులపై కూడా బురద చల్లారు. ఇప్పుడు మళ్లీ అదే చరిత్ర పునరావృతం అవుద్దేమో అనే సంశయంతో ఉన్నాం''
''ఈసారి జరిగిన ఎలక్షన్స్ లో శ్రీ విష్ణు గారి ప్యానల్ నుండి కొందరు, శ్రీ ప్రకాశ్ రాజ్ గారి ప్యానల్ నుండి కొందరు గెలవడం జరిగింది. మళ్లీ మాలో మాకు భిన్న అభిప్రాయాలు వచ్చే అవకాశం ఉంది. సహజంగా ప్రశ్నించే వ్యక్తిత్తం ఉన్న మేము అడగకుండా ఉండలేము. అందుకని 'మా' సంస్థని శ్రీ విష్ణుగారి ప్యానల్ వ్యక్తులే నడిపితే మా సభ్యులకు మంచి జరగవచ్చు అనే ఆశతో, ఉద్దేశ్యంతో, మేము 'మా' పదవులకు మనసా వాచా కర్మణా.. రిజైన్ చేస్తున్నాం. అయితే మమ్మల్ని గెలిపించిన సభ్యుల నమ్మకాన్ని నిలబెట్టుకోవాల్సిన బాధ్యత మాకుంది. అందువల్ల భవిష్యత్తులో 'మా' లో ఏ అభివృద్ధి జరక్కపోయినా, సంక్షేమ కార్యక్రమాలు జరక్కపోయినా ప్రశ్నిస్తుంటాం..'' అని ప్రకాశ్ రాజ్ ప్యానల్ సభ్యులు లేఖలో పేర్కొన్నారు.