Begin typing your search above and press return to search.
మంచు ప్యానెల్ పై ప్రకాష్ రాజ్ ఫిర్యాదు
By: Tupaki Desk | 5 Oct 2021 7:32 AM GMTమూవీ ఆర్టిస్టుల రాజకీయం పరాకాష్టకు చేరుకుంది. మంచు విష్ణు వర్సెస్ ప్రకాష్ రాజ్ వార్ పరాకాష్ఠకు చేరుకుంది. ఒకరితో ఒకరు ఢీ అంటే ఢీ అంటూ పోటీపడుతున్నారు. తాజాగా మంచు విష్ణు ప్యానెల్ పై ఎన్నికల అధికారికి ప్రకాశ్ రాజ్ ఫిర్యాదు చేశారు. 60 మందితో పోస్టల్ బ్యాలెట్ లో తమకు అనుకూలంగా మంచు విష్ణు ఓటు వేయించుకుంటున్నారనేది ప్రకాస్ రాజ్ ఫిర్యాదు. ఆ మేరకు ఎన్నికల సహాయ అధికారి నారాయణరావు కు ఫిర్యాదు చేశారు. హీరో శ్రీకాంత్.. జీవిత రాజశేఖర్ ఆయనకు బాసటగా ఫిర్యాదు చేసేందుకు ఛాంబర్ కి విచ్చేశారు.
మరో ఐదు రోజుల్లో ఎన్నికలు జరగనున్న వేళ.. ప్రకాష్ రాజ్ వర్సెస్ మంచు విష్ణు వార్ పరాకాష్టకు చేరుకుంది. ఈసారి మెగా వర్సెస్ మంచు వార్ గా దీనిని అభివర్ణిస్తున్నారు. అంతిమంగా విజయం ఎవరిని వరిస్తుంది? అన్నది ఆసక్తిగా మారింది.
ఎన్నికల్లో ఓటుకి నోటు కలకలం
`మా` అసోసియేషన్ (మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్) ఎన్నికలు అక్టోబర్ 10న జరగనుండగా రాజకీయంగానూ ఇది చర్చనీయాంశంగా మారింది. గత `మా` ఎన్నికలతో పోలిస్తే పవన్ వ్యాఖ్యల కారణంగా ఈ దఫా ఎన్నికలు ఇండస్ట్రీలో తీవ్ర దుమారాన్ని సృష్టించేవిగా వున్నాయి.
దీంతో ఆయన వ్యాఖ్యలపై స్పందించడానికి ఎవరూ సుముఖతని వ్యక్తం చేయడం లేదు. ఈ వాడీ వేడీ వాతావరణంలో `మా` ఎన్నికల ప్రచారానికి అభ్యర్థులు మరింత స్పీడ్ పెంచారు. ఇప్పటి వరకు ఓటర్లకు విందులు ఏర్పాటు చేసిన అభ్యర్థులు ఇప్పుడు ఏకంగా తమ ఓటర్లు చేయి జారి పోకుండా ఓటుకు నోటుతో కొనడానికి సిద్ధమయ్యారని కథనాలొచ్చాయి.
గెలుపు కోసం ప్రతీ అవకాశాన్ని వినియోగించుకోవాలని అభ్యర్థులు భావిస్తూ ఆ దిశగా ఏ చిన్న అవకాశం వున్నా దాని కోసం ఎంత ఖర్చు చేయడానికైనా వెనుకాడటం లేదని వినిపిస్తోంది. హైదరాబాద్ లో వుండే ఆర్టిస్ట్ లని కలుసుకుని వారికి అన్ని విధాలా అండగా వుంటామని.. తమకే ఓటు వేయాలని అభ్యర్థులు అభ్యర్థిస్తున్నట్టుగా తెలుస్తోంది.