Begin typing your search above and press return to search.
ఓఎంజీ: రామ్ లీలా నాటకం..పోర్న్ తో సమానం అట!
By: Tupaki Desk | 23 Oct 2019 9:21 AM GMTసీనియర్ నటుడు ప్రకాష్ రాజ్ సినిమాలు బాగా తగ్గించేశాడు. ఒక నటుడిగా ఆయన ఈ మధ్య అస్సలు చర్చల్లో ఉండట్లేదు. కొన్నేళ్లుగా రాజకీయాలతో ముడిపడే ఆయన పేరు మీడియాలో ప్రముఖంగా కనిపిస్తోంది. ప్రధాని నరేంద్ర మోడీని టార్గెట్ చేస్తూ కొన్నేళ్లుగా ఆయన అలుపెరగని పోరాటం చేస్తున్నాడు. హిందుత్వ ముద్ర ఉన్న ఆయన్ని వ్యతిరేకించే క్రమంలో తరచుగా హిందువుల సెంటిమెంట్లను దెబ్బ తీసేలా ప్రకాష్ రాజ్ మాట్లాడుతుండటం వివాదాస్పదమవుతోంది.
తాజాగా ఆయన లేవనెత్తిన అంశం మరీ విడ్డూరమైందే. దసరా వేడుకల్లో భాగంగా ఉత్తరాదిన ప్రదర్శించే ‘రామ్ లీలా’ నాటకం మీద ప్రకాష్ రాజ్ అభ్యంతరం వ్యక్తం చేశాడు. దీన్ని జనాల్లో ప్రదర్శించడం సరి కాదన్నారు. ఈ నాటకాన్ని అనుమతించడం అంటే చిన్న పిల్లాడికి పోర్న్ చూపించడంతో సమానం అంటూ షాకింగ్ కామెంట్ చేశాడు ప్రకాష్ రాజ్. రాముడు - సీత - లక్ష్మణుడు వేషాల్లో నటులు హెలికాఫ్టర్లలో రావడం కూడా మన సంస్కృతి కాదంటూ ఆయన అభ్యంతరం వ్యక్తం చేశారు.
ఐతే ప్రకాష్ రాజ్ వ్యాఖ్యల మీద సోషల్ మీడియాలో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఎప్పుడూ హిందువుల కల్చర్ మీదే అభ్యంతరాలు వ్యక్తమవుతాయా.. ఇతర మతాల వాళ్ల గురించి ఎప్పుడైనా ఇలా అభ్యంతరాలు వ్యక్తం చేశారా అని ప్రశ్నిస్తున్నారు. ప్రకాష్ రాజ్ లాంటి సూడో సెక్యూలరిస్టులు అటెన్షన్ కోసం హిందువుల్ని టార్గెట్ చేయడం సాధారణమే అని.. ఇలాంటి వాళ్లను లైట్ తీసుకోవాలని హితవు పలుకుతున్నారు ఇంకొందరు నెటిజన్లు.