Begin typing your search above and press return to search.

‘శౌర్య’ రివ్యూల మీద ప్రకాష్ రాజ్ మండిపాటు

By:  Tupaki Desk   |   9 March 2016 9:11 AM GMT
‘శౌర్య’ రివ్యూల మీద ప్రకాష్ రాజ్ మండిపాటు
X
సీనియర్ నటుడు ప్రకాష్ రాజ్ తీవ్ర ఆగ్రహానికి గురయ్యారు. మంచుమనోజ్.. రెజీనా జంటగా నటించిన శౌర్య చిత్రంపై వచ్చిన రివ్యూలపై ఆయన మండిపడ్డారు. గత వారం విడుదలైన ఈ సినిమాకు రివ్యూలలో యావరేజ్ ఇవ్వటం సరికాదన్నారు. మంచుమనోజ్ మంచి నటుడని.. ఏ పాత్రనైనా చేయగల సత్తా ఉందన్నారు. దర్శకుడు దశరథ్ తో కలిసి భిన్నంగా చేసిన సినిమా ‘శౌర్య’ అని.. చాలా డిఫరెంట్ బాడీ లాంగ్వేజ్ తో చేశాడన్నారు.

అలాంటి ప్రయోగాత్మక సినిమాలను ఎంకరేజ్ చేయాలని.. అప్పుడే కొత్త తరహా సినిమాలు వస్తాయన్న ప్రకాష్ రాజ్.. రివ్యూల రూపంలో జనాలపై మీ అభిప్రాయాల్ని రుద్దొద్దు అంటూ మీడియాపై ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు.
ఇదిలా ఉంటే.. చిత్ర హీరో మంచు మనోజ్ మాట్లాడుతూ.. సినిమా బాగుందని అందరూ అభినందిస్తున్నారని.. తానీ సినిమాలో యాక్ట్ చేసేందుకు అవకాశం ఇచ్చిన దర్శకుడు దశరథ్ కు థ్యాంక్స్ చెప్పారు. ప్రకాష్ రాజ్ తో యాక్ట్ చేసినప్పుడు.. తన తండ్రితో కలిసి నటించినప్పుడు ఎలా ఫీలయ్యానో అలానే ఫీలైనట్లుగా మనోజ్ చెప్పారు.