Begin typing your search above and press return to search.

దయచేసి నా పుస్తకం కొనండి

By:  Tupaki Desk   |   2 Feb 2018 5:54 AM GMT
దయచేసి నా పుస్తకం కొనండి
X
విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ తన కెరీర్లో ఎప్పుడు లేని విధంగా ఈ మధ్య అటు రాజకీయాలను ఇటు సామాజిక సమస్యలను అస్సలు వదలడం లేదు. తనదైన శైలిలో విమర్శలు చేస్తున్నారు. ప్రముఖ జర్నలిస్ట్ గౌరీ లంకేశ్ హత్య జరిగినప్పటి నుండి ఆయన మోడీ ప్రభుత్వంపై చాలా విమర్శలు చేస్తున్నారు. బీజేపీ ఎన్ని విధాలుగా రాజకీయాల్లో రాణించినప్పటికి విమర్శలు చేస్తూ వారికి ఆగ్రహం తెప్పిస్తున్నారు. ఎక్కువగా సోషల్ మీడియాలో ప్రకాష్ రాజ్ స్పందిస్తుంటారు.

అలాగే ఆయనకు సంబంధించిన ఏ విషయాన్ని అయినా ట్విట్టర్ ద్వారా తెలియజేయడం ఆయనకు అలవాటు. ఇక ఆయనలో రచయిత కోణం ఉందని అందరికి తెలిసిన విషయమే. దర్శకుడిగా రచయితగా నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న ప్రకాష్ రాజ్ ఇప్పుడు ఒక పుస్తకాన్ని కూడా రచించాడు. తన మాతృ బాషా కన్నడలో మొదటి పుస్తకాన్ని రచించాడు. అలాగే దాన్ని కొనుగోలు చేయాలని తన ఫాలోవర్స్ ని ప్రకాష్ రాజ్ కోరాడు.

అంతే కాకుండా ఒక మంచి కామెంట్ కూడా యాడ్ చేశాడు. ఒక పుస్తకంలో మీ ఆలోచనల ఆనందం ... కన్నడలో నా మొదటి పుస్తకం "ఇరువుదెల్లవ బిట్టు" విడుదలయింది. దయచేసి ఇప్పుడు కొనుగోలు చేయండి.. నవాకర్ణాటక ఆన్లైన్ వెబ్ సైట్ లో అని ప్రకాష్ రాజ్ ట్వీట్ చేశాడు. ఇక ప్రకాష్ రాజ్ ఎప్పటిలానే అన్ని భాషల్లో ప్రస్తుతం షూటింగ్స్ తో బిజీగా ఉన్నాడు.