Begin typing your search above and press return to search.
అమ్మ బయోపిక్ ఆ రెండు కీరోల్స్ ఎవరు?
By: Tupaki Desk | 9 Sep 2019 1:30 AM GMTదివంగత ముఖ్యమంత్రి జయలలితపై ఒకేసారి రెండు బయోపిక్ లు సెట్స్ కెళుతున్నాయి. వీటికి సంబంధించిన గ్రౌండ్ వర్క్ పూర్తి చేసి టైటిల్ పాత్రధారుల్ని పక్కాగా ప్రిపేర్ చేస్తున్నారు. అలాగే కాస్టింగ్ సెలక్షన్స్ లోనూ ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్నారని తాజా వివరాలు అందాయి. నిత్యామీనన్ - ప్రియదర్శిని బృందం ఇప్పటికే పక్కా ప్రిపరేషన్స్ లో ఉన్నారు. తాజాగా కంగన టైటిల్ పాత్రలో `ఏ.ఎల్.విజయ్- విజయేంద్ర ప్రసాద్- విష్ణు ఇందూరి` కాంబినేషన్ రూపొందిస్తున్న బయోపిక్ వివరాలు అంతకంతకు వేడెక్కిస్తున్నాయి.
ఈ చిత్రానికి ఇప్పటికే తలైవి- జయ అనే టైటిల్స్ పరిశీలనలో ఉన్నాయి. అక్టోబర్ లో ప్రారంభించేందుకు రెడీ అవుతున్నారు. జయలలిత లైఫ్ జర్నీని తెరపై ఎమోషనల్ గా చూపించనున్నామని నిర్మాత విష్ణు తెలిపారు. అయితే జయలలిత జీవితంలో ఓ ఇద్దరి పాత్రలు చాలా చాలా కీలకం. అందులో ఒకరు ఎంజీఆర్. ఇంకొకరు కరుణానిధి. ఒక రకంగా అర్జున-దుర్యోధనుల టైపు పాత్రలివి. అందుకే ఈ పాత్రల్ని ఆచితూచి ఎంపిక చేస్తున్నారని తెలుస్తోంది.
ఎంజీ రామచంద్రన్ (ఎంజీఆర్) పాత్రలో `ధృవ` ఫేం అరవింద స్వామిని ఎంపిక చేశారు. అలాగే కరుణానిధి పాత్రకు విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ ని ఎంపిక చేశారని తెలుస్తోంది. ప్రకాష్ రాజ్ ఇదివరకూ ఎన్టీఆర్ బయోపిక్ లో మేటి దర్శకనిర్మాత బి.నాగిరెడ్డి పాత్రలో నటించారు. అమ్మ బయోపిక్ కోసం కరుణానిధిగా ప్రామిస్సింగ్ రోల్ కి ఆయన్ని ఎంపిక చేయడం ఆసక్తిని రేకెత్తిస్తోంది. అమ్మ చిరకాల రాజకీయ ప్రత్యర్ధి పార్టీ డీఎంకే అధ్యక్షుడు కరుణానిధి పాత్రకు.. జయలలిత పాత్రకు (కంగన-ప్రకాష్ రాజ్) మధ్య వచ్చే సన్నివేశాలు సినిమాలో హైలైట్ గా నిలుస్తాయని తెలుస్తోంది. మణిరత్నం క్లాసిక్ మూవీ ఇద్దరు (ఇరువార్)లో ప్రకాష్ రాజ్ కరుణానిధిగా నటించగా.. మోహన్ లాల్ ఎంజీఆర్ పాత్ర పోషించిన సంగతి తెలిసిందే. అది కూడా పొలిటికల్ నేపథ్యం ఉన్న సినిమా. ఆ సినిమాలో జయలలిత పాత్రలో ఐశ్వర్యారాయ్ నటించారు. అలాగే ఇప్పుడు జయలలిత జీవితకథలో కరుణానిధి-ఎంజీఆర్ పాత్రలు అంతే ప్రత్యేకంగా కనిపిస్తాయట.