Begin typing your search above and press return to search.

మ‌ళ్లీ క‌లిసిన మైత్రి బంధం

By:  Tupaki Desk   |   3 Nov 2019 1:30 AM GMT
మ‌ళ్లీ క‌లిసిన మైత్రి బంధం
X
క్రియేటివ్ డైరెక్ట‌ర్ కృష్ణ వంశీ తెర‌కెక్కించిన క్లాసిక్ హిట్స్ ని అభిమానులు అంత తేలిగ్గా మ‌ర్చిపోలేరు. నిన్నే పెళ్లాడుతా-గులాబి- మురారి-ఖ‌డ్గం-అంతఃపురం వంటి బ్లాక్ బ‌స్ట‌ర్ చిత్రాలు అత‌డి కెరీర్ లో ఉన్నాయి. ఇక కృష్ణ‌వంశీ - ప్ర‌కాష్ రాజ్ అనుబంధం గురించి ప్ర‌త్యేకించి చెప్పాల్సిన ప‌నేలేదు. ఆ ఇద్ద‌రి కాంబినేష‌న్ లో వ‌చ్చిన‌ అంతఃపురం ఓ సంచ‌ల‌నం. ఎన్నో సినిమాల‌కు ఆ ఇద్ద‌రూ క‌లిసి ప‌ని చేశారు. వంశీ చివ‌రిగా తెర‌కెక్కించిన‌ `గోవిందుడు అంద‌రివాడేలే` చిత్రం వ‌ర‌కూ ఈ బంధం కొన‌సాగింది. ఇప్ప‌టికీ ఆ ఇద్ద‌రి స్నేహం అలానే కొన‌సాగుతోంది.

అయితే గ‌త కొంత‌కాలంగా కృష్ణ వంశీ కెరీర్ డైలమాలో ఉన్న‌ సంగ‌తి తెలిసిందే. స్టార్ హీరోల‌తో ప్ర‌య‌త్నించి విసిగిపోయిన కృష్ణ వంశీ ప్ర‌స్తుతం మ‌రాఠా హిట్ చిత్రం న‌ట‌సామ్రాట్ ని రీమేక్ చేసేందుకు రెడీ అవుతున్నార‌ని వార్త‌లొచ్చాయి. రుద్రాక్ష అనే టైటిల్ కూడా వినిపించింది. చిర‌కాల మిత్రుడు బండ్ల గ‌ణేష్ ఈ చిత్రంతో నిర్మాత‌గా రీఎంట్రీ ఇస్తున్నాడు. ఇప్ప‌టికే బౌండ్ స్క్రిప్టు రెడీ చేసి ప్రీప్రొడ‌క్ష‌న్ ప్రారంభించార‌ని.. న‌టీన‌టుల్ని ఎంపిక చేస్తున్నార‌ని ప్ర‌చార‌మ‌వుతోంది. వెంట‌నే షూటింగును ప్రారంభించేందుకు ఏర్పాట్లు సాగుతున్నాయిట‌. అయితే ఈ ప్రాజెక్టును ఇంకా అధికారికంగా ప్ర‌క‌టించాల్సి ఉంది.

ఈ సినిమాలో విల‌క్ష‌ణ న‌టుడు ప్ర‌కాష్ రాజ్ ఓ కీల‌క పాత్ర‌లో న‌టిస్తార‌న్న‌ది తాజా వార్త‌. ఒక‌వేళ ఇదే నిజ‌మైతే చాలా రోజుల త‌ర్వాత ప్ర‌కాష్ రాజ్ స్టామినాకి త‌గ్గ పాత్ర దొరికింద‌నే ఫ్యాన్స్ భావిస్తున్నారు. అత‌డి కోసం క్రియేటివ్ డైరెక్ట‌ర్ స్పెష‌ల్ గా ఆ రోల్ ని తీర్చిదిద్దార‌న్న అంచ‌నా వేస్తున్నారు.