Begin typing your search above and press return to search.
ప్రకాశ్ రాజ్ ను ముందు పెట్టి ఆడిస్తున్న ‘పవర్’ ఎవరు?
By: Tupaki Desk | 24 Jun 2021 6:30 AM GMTకీలక పరిణామం చోటు చేసుకున్నప్పుడు చాలామంది ఫోకస్ ఇతర అంశాల మీద ఉంటుంది. కానీ.. దాని వెనుక ఉన్నదేమిటన్న ప్రశ్నకు సమాధానం వెతికితే ఆసక్తికర అంశాలు బయటకు వస్తాయి. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (మా) అధ్యక్ష స్థానానికి తాను పోటీ చేయనున్నట్లుగా విలక్షణ నటుడు ప్రకాశ్ రాజ్ తెర మీదకు రావటం తెలిసిందే. అనంతరం చోటు చేసుకున్న పరిణామాల గురించి తెలిసిందే. దాదాపు మూడు నెలలకు పైనే ఎలక్షన్ కు టైం ఉన్న వేళ.. అందరి కంటే ముందే ప్రకాశ్ రాజ్ ఎంట్రీ ఇవ్వటం వెనుక అసలు కథ ఏమిటి? అన్నదిప్పుడు ప్రశ్నగా మారింది.
విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం.. ప్రకాశ్ రాజ్ వెనుక ఉన్నది మంత్రి కేటీఆర్ అన్న మాట బలంగా వినిపిస్తోంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడి.. తిరుగులేని అధికారాన్ని సొంతం చేసుకున్నప్పటికీ తెలుగు చిత్ర పరిశ్రమను ప్రభావితం చేయలేకపోతున్న భావన తెలంగాణ అధికారపక్షంలో ఉన్నట్లుగా చెబుతున్నారు. ఇండస్ట్రీ తెలంగాణలో ఉన్నప్పుడు తాము చెప్పిన వారు.. తాము కోరుకున్న వారు ఉన్నతస్థానాల్లో ఉండాలే కానీ.. అందుకు భిన్నంగా తమ ప్రమేయం లేకుండా ఉండటాన్ని గులాబీ అధినాయకత్వం జీర్ణించుకోలేకపోతుందని చెబుతున్నారు.
సినిమా ఇండస్ట్రీ మీద అధికారాన్ని ఏపీతో కలిపి పంచుకోవటానికి సిద్ధంగా లేదని చెబుతున్నారు. ఇప్పటికే పలు కీలక సంస్థల్లో తమ ముద్ర ఉండేలా జాగ్రత్తలు తీసుకున్న టీఆర్ఎస్ నాయకత్వం.. ఇప్పుడు సినీ పరిశ్రమ మీద ఫోకస్ చేసినట్లు చెబుతున్నారు. ఇండస్ట్రీలో అత్యధికులు ఏపీ మూలాలు ఉన్న వారే కావటంతో.. వారిని దగ్గరకు తీసుకోలేకపోతున్నట్లు చెబుతున్నారు. అనవసరమైన విమర్శలకు అవకాశం ఇవ్వకూడదన్నదే వారి ఆలోచనగా చెబుతారు.
అందుకే.. ప్రకాశ్ రాజ్ కు ఓటేసినట్లుగా చెబుతున్నారు. కన్నడిగు కావటం ప్లస్ పాయింట్ గా చెబుతున్నారు. వాస్తవానికి ఇదే అంశం ఆయనకు మైనస్ అవుతుందని ప్రచారం జరుగుతుంది. అయితే.. గులాబీ నాయకత్వం ఆలోచన మరోలా ఉందంటున్నారు. అందరిని ఆక్కున చేర్చుకునే హైదరాబాద్ కల్చర్ కు తీసిపోని రీతిలో ‘మా’ అధ్యక్షుడిగా ప్రకాశ్ రాజ్ ఉండటం తప్పు కాదన్నట్లుగా వారి ఆలోచనలు ఉన్నట్లు చెబుతున్నారు.
మంత్రి కేటీఆర్ నుంచి వచ్చిన సానుకూల సంకేతాలతోనే ప్రకాశ్ రాజ్ పోటీకి సిద్ధమైనట్లుగా చెబుతన్నారు. కేంద్రంలో మోడీకి వ్యతిరేకంగా బలమైన గళాన్ని విప్పే వారిలో ప్రకాశ్ రాజ్ ఒకరు. దీనికి తోడు తెలంగాణలోని ఒక గ్రామాన్ని ప్రకాశ్ రాజ్ దత్తత తీసుకోవటం ఒక ప్లస్ పాయింట్ గా మారింది. ప్రకాశ్ రాజ్ ను సీన్లోకి దించటం ద్వారా ఉండే ప్రయోజనాల్ని పరిగణలోకి తీసుకున్న తర్వాతనే ఆయన్ను ఓకే చేశారని చెబుతున్నారు. ఈ వాదనే నిజమైతే.. ఎన్నికల బరిలోకి వస్తున్న వారందరిని ఎలా బుజ్జగిస్తారు? బరిలో నుంచి తప్పుకునేలా తెర వెనుక ఏం జరుగుతుందన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.