Begin typing your search above and press return to search.
విలన్లనే ఆమెకి సహాయపడుతున్నారు..
By: Tupaki Desk | 11 Oct 2015 1:30 PM GMTఇండస్ట్రీకి వచ్చిన తొలినాళ్ళలోనే తనకంటూ ఒక గుర్తింపు సాధించిన అనుష్క అలియాస్ స్వీటీ శెట్టి ఇప్పుడు టాలీవుడ్ లో లేడీ ఓరియెంటెడ్ మూవీస్ కి కేర్ ఆఫ్ అడ్రెస్. కోడిరామ కృష్ణ 'అరుంధతి' సినిమాలో జేజెమ్మగా అలరించిన ఈ భామ చాలారోజుల తరువాత గుణశేఖరుడి కలల ప్రాజెక్ట్ లో రుద్రమ్మగా మరోసారి పూర్తి నిడివిగల పరాక్రమమైన పాత్రలో మెరిసింది.
అయితే లేడీ ఓరియెంటెడ్ పాత్రలో నెగ్గుకురావడం అంత సులభతరమైన విషయంకాదు. ఆ పాత్ర పక్కన మరేదైనా పెద్ద పాత్ర మొదటినుండి చివరివరకూ తోడుండి తనకు సహాయం చెయ్యగలిగే క్యారక్టర్ ఒకటి డెవలప్ చెయ్యకపోతే ఆ ఫీలింగ్ పండదు. అయితే అనుష్క విషయంలో అరుంధతి - రుద్రమదేవి సినిమాలలో ఆ అతి ముఖ్యమైన సైడ్ క్యారక్టర్ లు ప్రముఖ విలనీలు పోషించి సినిమాలకు అండగా నిలవడం విశేషం.
అరుంధతి సినిమాలో ఫకీరుగా షియాజీ షిండే అలరించాడు. నేటి తరం జేజెమ్మకి మొదటినుండి గద్వాల్ సామ్రాజ్యంలో అండగా వుంటూ ప్రేక్షకులను నటనతో కట్టిపడేశాడు. ఇప్పుడు రుద్రమదేవి సినిమాలో బుద్ధికుశలత కలిగిన మంత్రిగా ప్రకాష్ రాజ్ అద్భుతంగా నటించి, రుద్రమదేవి సినిమాకు ప్లస్ అయ్యాడు. ఆ విధంగా అనుష్కకి విలనీలే హెల్ప్ అయ్యారన్నమాట...