Begin typing your search above and press return to search.
ఇండస్ట్రీలో పవన్ తర్వాత ఉన్న ఏకైక మొనగాడు ప్రకాశ్ రాజేనా?
By: Tupaki Desk | 28 Feb 2022 4:29 AM GMTఎన్నాళ్లకు ఎన్నాళ్లకు అన్న రతిలో టాలీవుడ్ చిత్ర పరిశ్రమకు చెందిన ప్రముఖుడు ఒకరు.. టార్గెట్ చేసి మరీ వేధిస్తున్న వైనాన్ని ప్రశ్నించాల్సిన అవసరం ఉంది. కానీ.. అలాంటిదేమీ లేకుండా ఎవరి దారిన వారు ఉండటం ఎక్కువ అవుతోంది.
వ్యవస్థల్ని చూసినప్పుడు భయం ఉండటం తప్పే.అలా అని ప్రతి దానికి వణికే తీరు కూడా మంచిది కాదన్నది మర్చిపోకూడదు. చిత్ర పరిశ్రమను టార్గెట్ చేశారంటూఏపీ ప్రభుత్వంపై నిప్పులు చెరిగిన పవన్ తీరుపై ఏపీ సర్కారు సీరియస్ గా తీసుకోవటమే కాదు.. ఆయన సినిమాల్ని టార్గెట్ చేసేలా పరిణామాలు చోటు చేసుకోవటం తెలిసిందే.
ఇంత జరుగుతున్నా.. పవన్ కల్యాణ్ కు మద్దతుగా కానీ.. ఆయన కోసం దేనికైనా రెఢీ అన్నట్లుగా వ్యవహరిస్తామని గొప్పలు చెప్పుకునే వారంతా ఇప్పుడు అస్సలు మాట్లాడకుండా మౌనంగా ఉండటం మంచిదన్నట్లుగా టాలీవుడ్ వ్యవహరిస్తోంది. దీనిపై పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
ఇలాంటి వేళ.. అనూహ్యంగా సీనియర్ నటుడు.. ప్రకాశ్ రాజ్ సీన్లోకి వచ్చాడు. తాజాగా ఆయన సోషల్ మీడియాలో పెట్టిన పోస్టు ఆసక్తికరంగానే కాదు.. హాట్ టాపిక్ గా మారింది.
భీమ్లా నాయక్ మూవీ విషయంలో ఏపీ సర్కారు అనుసరించిన విధానాన్ని తప్పు పడుతూ ప్రకాశ్ రాజ్ పెట్టిన ట్వీట్ ను చూస్తే.. ఇంతకాలం ఇండస్ట్రీలో పవన్ తప్పించి.. మొనగాడు మరెవరో ఉండరన్న భావన తప్పని.. ఆయన తర్వాత అంతో ఇంతో ధైర్యం ఉన్న ఏకైక నటుడిగా ప్రకాశ్ రాజ్ సరికొత్త ఇమేజ్ ను సొంతం చేసుకోవటం గమనార్హం.
ఇంతకీ ఆయన ఏపీ ప్రభుత్వ తీరుపై చేసిన వ్యాఖ్యల్ని చూసినప్పుడు.. జరుగుతున్న అన్యాయంపై మాట్లాడే మొనగాడు టీలీవుడ్ లో అక్కడక్కడా ఉన్నారన్న భావన కలిగేలా చేయటం గొప్పే అవుతుంది.
ఇంతకీ ప్రకాశ్ రాజ్ చేసిన తాజా వ్యాఖ్యల్ని యథాతధంగా చూస్తే.. ‘‘సృజన, సాంకేతికత మేళవించిన సినిమారంగంపై అధికార దుర్వినియోగం, ఆధిపత్య ధోరణి ఏమిటి? చిత్ర పరిశ్రమను క్షోభపెడుతూ.. మేమే ప్రోత్సహిస్తున్నామంటే నమ్మలా? ఏవైనా ఉంటే రాజకీయ క్షేత్రంలో చూసుకోవాలి. కక్ష సాధింపులు బాక్సాఫీస్ దగ్గర ఎందుకు?ఎంతగా ఇబ్బంది పెట్టినా ప్రేక్షకుల ఆదరాభిమానాలకు ఎవరూ అడ్డకట్టవేయలేరు’’ అన్నప్రకాశ్ రాజ్ వ్యాఖ్య ఇప్పుడు అందరిని ఆకర్షిస్తోంది.
అంతేకాదు.. పవన్ తప్పించి మరో మొనగాడే లేడన్న దానికి భిన్నంగా ఇప్పుడు ప్రకాశ్ రాజ్ ఇప్పుడు ఆప్షన్ గా కనిపిస్తున్నారు.
మొత్తంగా మిగిలిన హీరోల మాదిరి మౌనంగా ఉండకుండా గళం విప్పిన ప్రకాశ్ రాజ్ ను అభినందించకుండా ఉండలేం. మీరేమంటారు?