Begin typing your search above and press return to search.
కేసీఆర్ బయోపిక్ పై ప్రకాష్ రాజ్ కామెంట్స్
By: Tupaki Desk | 9 May 2018 11:57 AM ISTటాలీవుడ్ లో బయోపిక్ పథం చాలా గట్టిగా వినిపిస్తోంది. సినీ నటుల నుంచి రాజకీయ నేతల వరకు అందరి కథలను తెరపై చూపించాలని సినీ ప్రముఖులు ఆసక్తి చూపుతున్నారు. ఇక తెలంగాణ సీఎం కేసీఆర్ బయోపిక్ కూడా తెరకెక్కబోతోందని గత కొంత కాలంగా వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. ప్రముఖ దర్శకుడు మధుర శ్రీధర్ ఆ విషయంపై వివరణ కూడా ఇచ్చాడు. ప్రస్తుతం బ్యాక్ గ్రౌండ్ జరుగుతోందని చాలా సార్లు చెప్పారు.
అలాగే సినిమాలో కేసీఆర్ పాత్రలో ఎవరు కనిపిస్తారు అనే విషయంపై కూడా అనేక రూమర్స్ వస్తున్నాయి. ఈ విషయంపై దర్శకుడు ఎలాంటి వివరణ ఇవ్వలేదు. ఇటీవల విలక్షణ దర్శకుడు ప్రకాష్ రాజ్ పేరు వినిపించగానే ఆ న్యూస్ ఒక్కసారిగా వైరల్ అయ్యింది. పైగా పాలిటిక్స్ పరంగా ప్రకాష్ రాజ్ కూడా ఆయనకు సన్నిహితంగా ఉండడంతో ఊహాగానాలు మరింత పెరిగాయి. ఇద్దరు తరచు కలుసుకోవడం ఫెడరల్ ఫ్రంట్ పై చర్చలు జరపడం వంటి విషయాల వల్ల అనుమానాలకు బలం పెరిగింది.
విషయం తెలుసుకున్న ప్రకాష్ రాజ్ ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆ విషయంపై క్లారిటీ ఇచ్చారు. కేసీఆర్ ను కలిసి వివిధ అంశాల గురించి చర్చించిన మాట నిజమే కానీ కేసీఆర్ బయోపిక్ లో తాను నటిస్తున్న అనే వార్తల్లో ఎలాంటి నిజం లేదని వివరణ ఇచ్చారు. కేసీఆర్ మంచి నాయకుడని రీసెంట్ గా పంచాయితీ రాజ్ బిల్ అంశాలపై చర్చించినట్లు ప్రకాష్ రాజ్ తెలియజేశారు.