Begin typing your search above and press return to search.
ప్రకాష్ రాజ్ చేసిందాంట్లో తప్పేముంది??
By: Tupaki Desk | 21 July 2016 1:44 PM GMTఅదేంటో తెలియదు కాని.. మీడియా ట్రయిల్స్ అనేవి ఎక్కువగా తెలుగులో మాత్రం సినిమాల విషయంలో తెగ జరుగుతుంటుంది. ఇప్పుడు వెర్సటైల్ నటుడు ప్రకాష్ రాజ్ గురించే తీసుకుందాం. మనోడు ''మన ఊరి రామాయణం'' అంటూ స్వీయ దర్శకత్వంలో ఒక సినిమా తీస్తున్నాడు. అదిగో అక్కడే వచ్చింది తంటా.
''ఈ సినిమా షూటింగ్ మాత్రమే కాదు.. పోస్టు ప్రొడక్షన్ కార్యక్రమాలు కూడా పూర్తయ్యాయి.. సెన్సారుకు రెడీ అవుతున్నాం.. త్వరలోనే ప్రమోషన్లు స్టార్ట్ చేస్తాం'' అంటూ నిన్న ట్వీటేశాడు ఈ నటుడు. దీనిని పట్టుకొని మన మీడియాలు ఏకేశాయి చూడండి.. అబ్బో ప్రమోషన్లు లేకుండా ఇలా కొత్త పిల్లలతో ఒక సినిమాను తీసుకొచ్చేస్తే.. దానికి హైప్ ఎలా వస్తుంది? ఈ మాత్రం లాజిక్ ప్రకాష్ రాజ్ కు తెలియదా అంటూ చీల్చి చెండాడుతున్నారు. ఇది విన్న ట్రేడ్ పండితులు మాత్రం.. ఛ నిజమా? అంటూ పెద్దగా నవ్వేస్తున్నారు.
ఇప్పుడు ''పెళ్ళి చూపులు'' అనే ఓ సినిమా వచ్చింది. అసలు సినిమా ఎప్పుడు మొదలైంది ఎప్పుడు పూర్తయ్యిందో తెలియదు. హైప్ కూడా లేదు. కాని ట్రైలర్ చూశాక మాత్రం అందరూ ఆ సినిమాకు ఎట్రాక్ట్ అయ్యారు. హైప్ వచ్చింది. సినిమా గ్రాండుగా రిలీజవుతోంది. ప్రకాష్ రాజ్ కూడా ఇదే ఫాలో అవుతున్నాడేమో. సో ఆయన చేసిన దాంట్లో తప్పేముంది? లాజిక్ మిస్సయ్యింది ప్రకాష్ కాదు.. ఎవరో చెప్పక్కర్లేదుగా!!