Begin typing your search above and press return to search.
ప్రశాంత్ నీల్ శ్రమిస్తుంటే ప్రకాష్‌రాజ్ టెన్షన్ పెడుతున్నాడుగా
By: Tupaki Desk | 21 March 2022 2:30 AM GMT`ఆర్ ఆర్ ఆర్` రిలీజ్ అవుతున్న నేపథ్యంలో ఇప్పడు అందరి దృష్టి మరో పాన్ ఇండియా మూవీపై పగడింది. అదే `కేజీఎఫ్ చాప్టర్ 2`. కన్నడ రాకింగ్ స్టార్ యష్ హీరోగా నటించిన `కేజీఎఫ్ చాప్టర్ 1` 2018లో విడుదలై ఐదు భాషల్లో పాన్ ఇండియా వైడ్ గా సంచలన విజయాన్ని సాధించింది. వసూళ్ల పరంగానూ ఈ మూవీ సరికొత్త రికార్డులు క్రియేట్ చేసింది. యాక్షన్ చిత్రాల్లో సరికొత్త వసూళ్లని రాబట్టి దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. దీంతో ఈ సినిమారు సీక్వెల్ గా రిలీజ్ కానున్న `కేజీఎఫ్ చాప్టర్ 2` పై అంచనాలు నెలకొన్నాయి.
ఆ అంచనాలకు ఏ మాత్రం తీసిపోని స్థాయిలో దర్శకుడు ప్రశాంత్ నీల్ ఈ మూవీని తెరకెక్కించారు. గత ఏడాది క్రితం విడుదల చేసిన టీజర్ సృష్టించిన భీభత్సం అంతా ఇంతా కాదు. యూట్యూబ్ లో ఈ మూవీ టీజర్ సరికొత్త చరిత్రని సృష్టించి అబ్బుర పరిచింది. ఇప్పటి వరకు టీజర్ 240 ప్లస్ మిలియన్ వ్యూస్ ని క్రాస్ చేసి సరికొత్త రికార్డుని సృష్టించింది. టీజర్ తిరగరాస్తున్న రికార్డ్స్ ని దృష్టిలో పెట్టుకున్న మేకర్స్ ఈ మూవీ ఇండియన్ బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ ల సునామీని సృష్టించడం ఖాయమన్న కాన్ఫిడెన్స్ తో వున్నారు.
ఈ మూవీ కోసం ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారని తెలిసినా మేకర్స్ మాత్రం ప్రమోషన్స్ పై పెద్దగా దృష్టి పెట్టడం లేదంటూ గత కొన్ని నెలలుగా అభిమానులు కామెంట్ లు చేస్తూనే వున్నారు. ఇదిలా వుంటే `తుఫాన్ ...` తొలి లిరికల్ వీడియోని విడుదల చేస్తున్నామంటే చిత్ర బృందం తాజాగా ప్రకటించింది. అంటే కాకుండా అంతకు ముందే ఈ మూవీ ట్రైలర్ ని మార్చి 27న విడుదల చేస్తున్నామంటూ ప్రకటిస్తూ ఓ పోస్టర్ ని కూడా రిలీజ్ చేసింది. ప్రస్తుతం ట్రైలర్ ని కట్ చేసే పనిలో వున్నారట.
అభిమానులు, ప్రేక్షకుల నుంచి వస్తున్న ఒత్తిడి నేపథ్యంలో ట్రైలర్ ని కట్ చేయడం ప్రశాంత్ నీల్ కు ఇప్పడు సవాల్ గా మారిందిన, అంచనాలకు అనుగుణంగా ట్రైలర్ ని కట్ చేయాలని ప్రశాంత్ భావిస్తున్నారట. ఇదిలా వుంటే ప్రకాష్ రాజ్ ఈ చిత్రానికి తలనొప్పిగా మారుతున్నారని అభిమానులు ఆందోళనని వ్యక్తం చేస్తున్నట్టుగా చెబుతున్నారు. ఇటీవల విడుదలైన `ది కశ్మీరీ ఫైల్స్` దేశ వ్యాప్తంగా సంచలనాలు సృష్టిస్తోంది. కశ్మీరీ పండిట్ ల నరమేధం నేపథ్యంలో రూపొందిన ఈ చిత్రాన్ని కొంత మంది ప్రశంసిస్తుంటే కొంద మంది విమర్శలు చేస్తున్నారు.
మానిన గాయాన్ని మళ్లీ రేపుతున్నారా? అని కొంత మంది ప్రశ్నిస్తున్నారు. నటుడు ప్రకాష్ రాజ్ కూడా ఈ సినిమాపై వివాదాస్పదంగా ఇటీవల స్పందించారు. మానిన గాయాల్ని మళ్లీ రేపుతున్నారా? అని ఆయన ట్విట్టర్ వేదికగా చిత్ర బృందాన్ని ప్రశ్నించారు. అంతే కాకుండా సినిమా పూర్తయిన తరువాత కొంత మంది హిందూత్వ గురించి ప్రసంగిస్తున్న వీడియోలని కూడా ఆయన పోస్ట్ చేస్తూ ఏం జరుగుతోంది? అని ట్వీట్ లు చేస్తున్నారు.
ఇది `కెజిఎఫ్ చాప్టర్ 2` చిత్రానికి తీవ్ర ఇబ్బందుల్ని కలిగించేలా వుందని, ఆయనని అదుపు చేయండని మేకర్స్ ని, డైరెక్టర్ ని యస్ అబిమానులు రిక్వెస్ట్ చేస్తుండటం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ప్రకాష్ రాజ్ ఈ చిత్రంలో ఓ కీలక పాత్రలో నటించారు. అదే ఇప్పుడు యష్ అభిమానులని, ప్రశాంత్ నీల్ ని టెన్షన్ కు గురిచేస్తోందని కన్నడ అభిమానులు చెబుతున్నారు.