Begin typing your search above and press return to search.
#మా ఎన్నికలు.. ప్యానెల్ ని ప్రకటించి రేసుగుర్రంలా కాలు దువ్వాడు!
By: Tupaki Desk | 3 Sep 2021 4:30 PM GMT2021-24 సీజన్ కి మా ఎన్నికలు అక్టోబర్ 10న జరగనున్న సంగతి తెలిసిందే. ఈసారి నువ్వా నేనా అంటూ ఐదుగురు అధ్యక్ష పదవికి పోటీపడుతున్నారు. అయితే ప్రకాష్ రాజ్ ప్యానెల్ .. మంచు విష్ణు ప్యానెల్ మధ్యనే అసలైన పోటీ నెలకొంది. ఆ ఇద్దరూ ఎవరికి వారు ప్రచారంలో దూసుకుపోతున్నారు. మాటా మాటా పెరుగుతున్న సంగతి తెలిసిందే. ఇక ఈ వార్ లో జీవిత రాజశేఖర్ ప్రకాష్ రాజ్ ప్యానెల్ తరపున పోటీ చేస్తుండడం తాజా ట్విస్టు. ఇక వీకే నరేష్ అధ్యక్ష పదవికి మరోసారి పోటీపడనున్నారని కథనాలొచ్చాయి.
ఇంతలోనే ప్రకాష్ రాజ్ ప్యానెల్ ని మరోసారి స్పష్ఠంగా మీడియాకు ప్రకటించారు. అధ్యక్ష పదవికి ప్రకాష్ రాజ్ పోటీపడుతుండగా.. ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ పోటీలో శతాధిక చిత్రాల కథానాయకుడు శ్రీకాంత్ నిలవగా.. నటి హేమ.. బెనర్జీ లు ఉపాధ్యక్ష పోటీబరిలో ఉన్నారు. జీవిత రాజశేఖర్ జనరల్ సెక్రెటరీ గా పోటీపడుతుండగా.. ఉత్తేజ్ - అనిత చౌదరి జాయింట్ సెక్రటరీ లు గా బరిలో దిగుతున్నారు. ట్రెజరర్ గా నటుడు నాగినీడు పోటీపడుతున్నారు.
ఈసీ సభ్యులుగా 18 మంది పేర్లు వినిపిస్తున్నాయి. అనసూయ- అజయ్- భూపాల్- బ్రహ్మాజీ- ఈటివి ప్రభాకర్- గోవిందరావు- ఖయ్యుం- కౌశిక్- ప్రగతి- రమణ రెడ్డి- శ్రీధర్ రావు- శివ రెడ్డి- సమీర్- సుడిగాలి సుధీర్- సుబ్బరాజు. డి- సురేష్ కొండేటి- తనీష్- టార్జాన్ లు ఉన్నారు. ఈ సీజన్ ఎన్నికల్లో రగడ కాస్త పీక్స్ లో నే ఉండనుందని సన్నివేశం చెబుతోంది. ఒకసారి ప్యానెల్ ప్రకటించాక.. మరోసారి ప్రకటించి ప్రకాష్ రాజ్ రేసుగుర్రంలా ముందుకు ఉరుకుతున్నారు.
ప్రకాష్ రాజ్.. విష్ణు.. వీకే నరేష్ ఎవరికి వారు పోటీబరిలో ఉన్నారు. వీరితో పాటు సీవీఎల్ తెలంగాణ కళాకారుల తరపున పోటీకి దిగుతున్నారు. మా అసోసియేషన్ భవంతి నిర్మాణమే ఎజెండాగా మంచు విష్ణు స్ట్రాంగ్ గా ఉన్నారు. ఆయన డబ్బు పెట్టడమే గాక.. మూడు స్థలాల్ని వెతికానని ప్రకటించి వేడి పెంచారు. ఇక తెలంగాణ ప్రభుత్వం తరపున మా అసోసియేషన్ కి స్థలం కోరతానని ప్రకాష్ రాజ్ అంటున్నారు. మెగా ఫ్యామిలీ అండదండలతో ఈసారి ప్రకాష్ రాజ్ గెలుపు ఖాయం అని ఒక వర్గం ప్రచారం చేస్తుంటే.. మరోవర్గం కృష్ణంరాజు- బాలకృష్ణ అండదండలతో విష్ణు బాబు గెలుస్తాడని ప్రచారం చేస్తోంది. వీకే నరేష్ అధ్యక్ష బరిలో నిలుస్తున్నారు కాబట్టి కృష్ణ- మహేష్ సేనల అండ అతడికి ఉంటుంది. అంతిమంగా ఎవరు గెలిచినా గెలవకపోయినా `మా` సొంత భవంతి కల నెరవేరుస్తారా లేదా? అన్నదే ఇప్పటికి సస్పెన్స్ ఎలిమెంట్. మా సంఘంలోని 950 మంది సంక్షేమం గాలికి వదిలేయకుండా ముందుకు వెళతారనే అంతా ఆశిస్తున్నారు.