Begin typing your search above and press return to search.

కొత్త ట్విస్టు.. గెలిచినోళ్ల కంటే ఓడినోళ్ల ఇంటర్వ్యూలకే డిమాండ్?

By:  Tupaki Desk   |   12 Oct 2021 12:49 PM GMT
కొత్త ట్విస్టు.. గెలిచినోళ్ల కంటే ఓడినోళ్ల ఇంటర్వ్యూలకే డిమాండ్?
X
ప్రజలు దగ్గర నుంచి మీడియా వరకు అందరు విజేతల చుట్టూనే తిరుగుతారు. పరాజితుల గురించి పెద్దగా పట్టించుకోరు. గెలుపు బాట పట్టినోళ్లకు ప్రయారిటీ ఇచ్చే రోటీన్ కు భిన్నమైన పరిణామాలు టాలీవుడ్ లో చోటు చేసుకోవటం ఆసక్తికరంగా మారింది. సాధారణంగా పొలికల్ కావొచ్చు.. సినిమా.. క్రీడారంగం..ఇలా ఏదైనా కావొచ్చు.. ఒక అసోసియేషన్ కు ఎన్నికలు జరిగి.. దానికి విపరీతమైన ప్రయారిటీ మీడియా ఇచ్చిందంటే అందులో సెలబ్రిటీలకు సంబంధించిన అంశం తప్పనిసరిగా ఉంటుంది.

మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) ఎన్నికలకు సంబంధించిన కవరేజ్ లో అత్యధిక ప్రాధాన్యత ఇవ్వటానికి కారణం ఇదే. విచిత్రమైన విషయం ఏమంటే.. ఈసారి జరిగిన ఎన్నికల్లో ప్రకాశ్ రాజ్ ఓడిపోయి.. మంచు విష్ణు గెలిచారు. సాధారణంగా ఎన్నికల ఫలితాలు వెల్లడైనంతనే.. విజేతలుగా నిలిచిన వారి చుట్టూ మీడియా తిరగటమే కాదు.. పెద్ద ఎత్తున ఇంటర్వ్యూలు రావటం సహజంగా జరుగుతుంటుంది. అందుకు భిననమైన వాతావరణం తాజాగా నెలకొందని చెబుతున్నారు.

గెలిచిన మంచు విష్ణు ఇంటర్వ్యూల కంటే కూడా.. ఓడిన ప్రకాశ్ రాజ్ ఇంటర్వ్యూ కోసం మీడియా ప్రయత్నాలు చేయటం గమనార్హం. ఇప్పటికే పలు ప్రధాన మీడియా సంస్థలు ప్రకాశ్ రాజ్.. నాగబాబుతో సహా పలువురి ఇంటర్వ్యూలు అడగటం.. అందుకు వారిలో కొందరు నో చెప్పేస్తే.. మరికొందరు ఆలోచించి చెబుతామని చెప్పి తప్పుకుంటున్నారు. ఓడిన వారికే ఇంత డిమాండ్ ఉన్నప్పుడు.. గెలిచిన విష్ణును చాలామంది ఇంటర్వ్యూల కోసం అడుగుతారనుకుంటాం. చిత్ర వర్గాల నుంచి అందుతున్న సమచారంతో పాటు.. మంచు సన్నిహితుల నుంచి వస్తున్న సమాచారం ప్రకారం చూస్తే.. ఫలితాలు వెల్లడైన తర్వాత మంచు విష్ణు ఇంటర్వ్యూల కోసం ఎవరూ సంప్రదించలేదట. ఇదిప్పుడు సినీ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. ఎందుకిలా? అన్నదిప్పుడు ప్రశ్నగా మారింది.