Begin typing your search above and press return to search.
నిషేదాల పై స్పందించిన ప్రకాష్ రాజ్..!
By: Tupaki Desk | 17 Oct 2021 1:30 AM GMTవిలక్షణ నటుడు, దర్శకుడు, నిర్మాత ప్రకాష్ రాజ్ గురించి సినీ అభిమానులకు ప్రత్యేక పరిచయాలు అవకాశం లేదు. భాషతో సంబంధం లేకుండా పాత్ర ఏదైనా పరకాయ ప్రవేశం చేయడం ప్రకాష్ రాజ్ కు వెన్నతో పెట్టిన విద్య. నవరసాలు పండిచడంలో ఆయనకు ఆయనే సాటి అనిపించుకున్నాడు. అందుకే నటుడిగా నాలుగు జాతీయ అవార్డులు అందుకున్నారు. సినిమాలతో ఫుల్ బిజీగా ఉండే ప్రకాష్ రాజ్.. ఇటీవల జరిగిన 'మా' ఎన్నికల వ్యవహారంతో వార్తల్లో నిలిచారు.
మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) ఎన్నికల్లో అధ్యక్షుడిగా పోటీ చేసిన ప్రకాష్ రాజ్.. ప్రత్యర్థి మంచు విష్ణు మీద ఓడిపోయారు. ఈ ఎన్నికల్లో ప్రత్యర్థి వర్గం విలక్షణ నటుడిపై ప్రయోగించిన ప్రధాన అస్త్రాల్లో ప్రాంతీయవాదం ఒకటైతే.. క్రమశిక్షణా రాహిత్యం మరొకటి. షూటింగ్ సమయాల్లో ప్రకాష్ రాజ్ ప్రవర్తన సరిగా ఉండదని.. సమయానికి రాడని ఆరోపించారు. అలానే అతని వ్యవహారశైలి మీద గతంలో అనేకసార్లు 'మా' అసోసియేషన్ హెచ్చరించడం.. కొన్నిసార్లు నిషేధం విధించడం వంటివి ప్రస్తావించారు. అయితే ఇటీవల అలీ హోస్ట్ చేస్తున్న ఓ టాక్ షో లో ప్రకాశ్ రాజ్ ఈ ఆరోపణలు లపై స్పందించారు.
ప్రకాష్ రాజ్ మాట్లాడుతూ.. ''ఒకసారి సెట్ లో ఒక అమ్మాయి మీద ఒకతను రాయి విసురుతుంటే.. అతన్ని పక్కకు తోసాను. దానికి కొట్టాడు అని ఫిర్యాదు చేశారు. దానికి ఒకసారి బ్యాన్ చేశారు. ఇంకోసారి ఒక యాక్టర్ నటన నచ్చకపోవడంతో ఓ డైరెక్టర్ నన్ను పెట్టి రీషూట్ చేయాలని అనుకున్నారు. ఒక నటుడు ఆల్రెడీ చేసిన రోల్ నేను ఎందుకు చేయాలని ప్రశ్నించినందుకు బ్యాన్ చేశారు. మహేశ్ బాబుతో ఒక సినిమా చేయాల్సి ఉండగా.. షూటింగ్ వాయిదా వేస్తూ వెళ్తుండటం వల్ల డేట్లు కుదరలేదు. దీంతో వేరే ఆర్టిస్ట్ ని తీసుకుంటామని అడిగితే అప్పుడు ఉడుకు రక్తంలో ఉన్న నేను ఓకే అన్నాను. అయితే పేపర్లలో మాత్రం ప్రకాష్ రాజ్ ని తీసేసి వేరే నటుడిని పెట్టుకున్నారని రాశారు. నేను ఊరుకోకుండా అలా ఎలా రాస్తారు.. డేట్స్ లేకపోవడంతో బయటకు వెళ్లాడని రాయండి అని గట్టిగా అడిగాను. దాంతో బ్యాన్ చేశారు'' అని తెలిపారు.
''శ్రీనువైట్ల తో ‘ఆగడు’ సినిమా చేస్తున్ననప్పుడు ఒక సీన్ కంప్లీట్ చేసాను. ఆయనకు కావాల్సిన స్పీడ్ రావట్లేదేమో.. డైరెక్టర్ కాబట్టి ఆయన అనుకున్నది రాకపోయే సరికి ఇరిటేట్ అయ్యారేమో.. అప్పుడు ఆయన ఏ మూడ్ లో ఉన్నారో నాకు తెలియదు. నేను అక్కడి నుంచి వెళ్లిపోయాను. సీనియర్ ఆర్టిస్టుగా నాకున్న చనువుతో 'శీను రేపు ఒకసారి కలిసి మాట్లాడుకుందాం. ఈ స్పీడ్ నాకు నచ్చడం లేదు.. కొంచెం డిస్టర్బ్ గా ఉంది' అన్నాను. మరుసటి రోజు నా స్థానంలో సోనూసూద్ ని తీసుకున్నారు. ఆ తర్వాత బ్యాన్ అన్నారు. నేను బూతులు తిట్టానని నిషేధం విధించారు. ఇలా కొన్ని ఇగోల వల్ల ముక్కుసూటి తనం వల్ల అయ్యుండొచ్చు'' అని ప్రకాష్ రాజ్ చెప్పుకొచ్చారు.
'ప్రకాశ్ రాజ్ కు ఇలాంటి ఆటిట్యూడ్ లేకుంటే పరిశ్రమ నెత్తిన పెట్టుకునేదేమో అని నా అభిప్రాయం' అని అలీ అనగా.. ''ఒకవేళ ఈ ఆటిట్యూడ్ లేకుండా ఉండుంటే నేను ఇంత స్ట్రాంగ్ పర్సనాలిటీగా మారేవాడిని కాదేమో. ప్రతిఒక్కరూ ఒకేలా ఉండలేరు కదా. నేనే కరెక్ట్ అని చెప్పడం లేదు. నేను ఇలా ఉండటం వల్ల ఎంత పొందానో, అంత పొగొట్టుకున్నాను కూడా'' అని బదులిచ్చారు విలక్షణ నటుడు. ప్రకాశ్ రాజ్ లక్ష్యమేంటని ప్రశ్నించగా.. ''తీవ్రంగా బతకడం. కేవలం 120 రూపాయలతో చెన్నైకి వచ్చాను. టార్గెట్ అనేది స్టార్టింగ్ లో ఉంటుంది. అక్కడికి చేరుకున్నాక ఇంకేదో చేయాలనిపిస్తుంది. ఈ క్రమంలో ప్రయాణంలో ఏదొకటి నేర్చుకుంటాం. ప్రత్యేకంగా టార్గెట్స్ అంటూ ఏమీ ఉండవు'' అని చెప్పుకొచ్చారు.