Begin typing your search above and press return to search.
మహానటి పక్కన మరో మహా నటుడు
By: Tupaki Desk | 20 Aug 2017 5:36 AM GMTఅందం- అభినయంతో ఒక తెలుగమ్మాయి అంటే ఇలా ఉండాలి అని వెండి తెరపై చూపించిన అలనాటి తార సావిత్రి. ఆ మహానటి జీవితంలోని ఊహించని మలుపులు - అనుకోని ఘటనలు చాలామందికి తెలియదు. ఆ సందేహాలన్నీ జవాబు లేని ప్రశ్నలుగానే మిగిలిపోయాయి. అందుకే ఆ సందేహాలన్నింటిని తీర్చి ఆమె జీవితాన్ని మన కళ్లముందుకు నాగ్ అశ్విన్ అనే దర్శకుడు తీసుకురాబోతున్న సంగతి తెలిసిందే.
"మహానటి" గా తెరకెక్కుతున్న ఆ చిత్రంలో ఇప్పటికే పాత్రాలన్నింటిని సెలెక్ట్ చేసింది చిత్ర యూనిట్. సావిత్రిగా - కీర్తి సురేష్.. అలాగే సావిత్రి భర్త అయిన జెమిని గణేషన్ పాత్రలో దుల్కర్ సల్మాన్ కనబడుతున్నారు. ఇక సావిత్రి జీవితాన్ని ఒక దారిలో నడిపించిన ఓ వ్యక్తి పాత్రకు విలక్షణ నటుడు అయిన ప్రకాశ్ రాజ్ ని సెలెక్ట్ చేశారు. ఆయన చేయబోయే పాత్ర ఎవరిదో కాదు. సావిత్రి జీవితాన్ని ఒక్కసారిగా మార్చిన ఓ నిర్మాత క్యారెక్టర్. అనేక చిత్రాలకు బి.నాగిరెడ్డి గారితో సహ నిర్మాతగా కొనసాగిన అల్లూరి చక్రపాణి గారు. ముఖ్యంగా 'మిస్సమ్మ - మాయాబజార్ - గుండమ్మ కథ' వంటి చిత్రాల్లో సావిత్రి నటించిన విషయం తెలిసిందే. అయితే ఆ చిత్రాలను విజయ బ్యాన్నర్ లో నాగిరెడ్డి గారికి భాగస్వామిగా ఉంటూ చక్రపాణిని గారు నిర్మించారు. దీంతో ఆ పాత్ర సినిమాలో చాలా కీలకమైంది కావడంతో ప్రకాష్ రాజ్ ని ఎంచుకున్నారు.
ఇక మహానటి సావిత్రి కథలో సమంత కూడా ఓ ముఖ్య పాత్రను పోషిస్తున్న సంగతి తెలిసిందే..ఈ సినిమా తెలుగులోనే కాకుండా తమిళ్ మరియు మలయాళంలో కూడా రూపుదిద్దుకొంటోంది. ప్రస్తుతం అలనాటి కాలనికి తగ్గట్టుగా కొన్ని సెట్స్ వేసి అందులో నిర్విరామంగా షూటింగ్ చేసే ప్లాన్స్ లో ఉన్నాడట దర్శకుడు నాగ్ అశ్విన్. ఇంతకుముందు ఈ దర్శకుడు నానితో ఎవడే సుబ్రహ్మణ్యం సినిమాను తీసి మంచి హిట్ అందుకున్నాడు. ఇక మహానటి సినిమాను వైజయంతి ప్రొడక్షన్ లో సి. అశ్వినిదత్ నిర్మిస్తున్నారు.