Begin typing your search above and press return to search.
పవన్ క్యారెక్టర్ పై.. ప్రకాష్ రాజ్ సంచలన వ్యాఖ్యలు..!
By: Tupaki Desk | 13 April 2021 4:30 AM GMTపవన్ కల్యాణ్ లేటెస్ట్ మూవీ ‘వకీల్ సాబ్’ ఇటీవల విడుదలైన ఈ చిత్రం విజయవంతంగా దూసుకెళ్తోంది. ఈ చిత్రంలో పవన్ కు ధీటుగా నటించారు ప్రకాష్ రాజ్. లాయర్ నంద గోపాల్ పాత్రలో ఆయన జీవించారు. తాజాగా ఈ చిత్రంపై ఆయన స్పందించారు. పవన్ క్యారెక్టర్ గురించి కూడా మాట్లాడారు.
సినిమాలో సందేశం ఎంత ఉన్నా.. వినోదం ప్రధానం అని చెప్పారు. అది లేకపోతే ప్రేక్షకుడు సినిమా చూడడు అని చెప్పారు ప్రకాష్ రాజ్. ఇక, పవన్ కల్యాణ్ మూడేళ్ల తర్వాత చేస్తున్న సినిమా కాబట్టి.. కమర్షియల్ అంశాలను చేర్చడం అనివార్యమని, ఈ విషయంలో మేకర్స్ తగిన జాగ్రత్తలు తీసుకున్నారని చెప్పారు.
పింక్ సినిమాలో అమితాబ్ నటించినప్పుడు దానిపై ఉన్న అంచనాలు వేరు అని చెప్పారు. అదే సినిమాను తమిళ్ లో అజిత్ రీమేక్ చేసినప్పుడు ఆయనకు అనుగుణంగా మార్చారు. తెలుగులో పవన్ చేయాల్సి రావడం.. అది కూడా రీఎంట్రీ సినిమా కావడంతో పవన్ ఇమేజ్ ను దృష్టిలో పెట్టుకొని మార్పులు చేశారని చెప్పారు.
ఇక, పవన్ వ్యక్తిత్వం గురించి మాట్లాడుతూ.. పవన్ ఆలోచనా విధానానికి తగిన కథే వకీల్ సాబ్ అని చెప్పారు. ప్రీ-రిలీజ్ ఈ వెంట్లో పవన్ ‘రాజకీయంగా భిన్నాభిప్రాయాలు ఉన్నా.. ప్రకాష్ రాజ్ గారిని గౌరవిస్తాను’ అన్నారు. నిజంగా పవన్ ఒక లీడర్ అని అన్నారు. ఓడిపోయినా.. ప్రజల కోసం నిలబడి ఉన్నారని చెప్పారు ప్రకాష్ రాజ్.