Begin typing your search above and press return to search.

ప్రకాష్‌ రాజ్ కు లీగల్ నోటీస్

By:  Tupaki Desk   |   2 Feb 2018 3:52 AM GMT
ప్రకాష్‌ రాజ్ కు లీగల్ నోటీస్
X
ప్ర‌కాష్ రాజ్ టైం అస్స‌లు బాగున్న‌ట్టు లేదు. ఒక‌దాని వెంట ఒక‌టి స‌మస్య ప‌ల‌క‌రించి పోతున్నాయ్‌. మొన్న‌టి వ‌ర‌కు రాజ‌కీయ నాయ‌కుడిలా మారి... బీజేపీపైనా - మోడీ పైనా విమ‌ర్శ‌లు చేసిన ఈ సీనియ‌ర్ న‌టుడు త‌న‌కు తానే స‌మ‌స్య‌లు తెచ్చుకున్నాడు. ఇప్పుడు అనుకోకుండా మ‌రో ఇబ్బంది వ‌చ్చి ప‌డింది. ఆ ఇబ్బంది ఓ లీగ‌ల్ నోటీసును కూడా తెచ్చి పెట్టింది.

గ‌తంలో ప్రకాష్ రాజు తెలుగు ఉల‌వచారు బిర్యాని అనే సినిమాను తీశారు. అందులో తానే న‌టించి - ద‌ర్శ‌క‌త్వం కూడా వ‌హించాడు. ఆ సినిమా మ‌ల‌యాళంలో తీసిన సాల్ట్ అండ్ పెప్ప‌ర్ సినిమాకు రీమేక్‌. దీనిని హిందీలో కూడా తీశాడు ప్ర‌కాష్ రాజు. లీడ్ రోల్స్ లో నానా పాటేక‌ర్‌ - శ్రియా న‌టించారు. సినిమా పేరు త‌డ్కా. 2016లోనే సినిమా పూర్త‌యినా ఆర్ధిక స‌మ‌స్య‌ల వ‌ల్ల సినిమా విడుద‌ల అవ్వ‌లేదు. ఈ సినిమాకు ఫైనాన్స్ చేసిన వారిలో జాహిద్ ఖాన్ అనే వ్య‌క్తి కూడా ఉన్నారు. సినిమాకు ఎవ‌రూ బ‌య్య‌ర్లు రాక‌పోవ‌డంతో ఇన్నాళ్లు ఫైనాన్షియ‌ర్లు ప్ర‌కాష్ రాజ్‌ ను ఇబ్బంది పెట్ట‌లేద‌ని టాక్.

కాని తాజాగా ఆ సినిమాకు బ‌య్యర్ దొరికాడ‌ని... అయినా త‌న డ‌బ్బులు తిరిగి ఇవ్వ‌డం లేదంటూ జాహిద్ ఖాన్ ప్ర‌కాష్ రాజ్ లీగ‌ల్ నోటీసులు పంపించాడు. ఇప్ప‌డు ఆ స‌మ‌స్య‌ను ప్ర‌కాష్ రాజ్ ఎలా ప‌రిష్క‌రించుకుంటాడో. ఇప్ప‌టికే రాజ‌కీయ ప‌రంగా కామెంట్లు చేసి పీక‌ల్లోతు క‌ష్టాల్లో మునిగిపోయినా ఈ న‌టుడికి... లీగ‌ల్ నోటీసు కొత్త చిక్కులు తెచ్చిపెట్టేట్టు క‌నిపిస్తోందంటున్నారు సినీ జ‌నాలు. ప్ర‌కాష్ రాజ్ కు ఆ స్థాయిలో ఆర్ధిక స‌మ‌స్య‌లు ఉన్నాయా? అనే కోణంలో కూడా కామెంట్లు వినిపిస్తున్నాయి.