Begin typing your search above and press return to search.

#మీటూ : అర్జున్‌ పై పెరుగుతున్న మాటల దాడి

By:  Tupaki Desk   |   22 Oct 2018 10:22 AM GMT
#మీటూ : అర్జున్‌ పై పెరుగుతున్న మాటల దాడి
X
బాలీవుడ్‌ లో మొదలైన మీటూ ఉద్యమం మెల్ల మెల్లగా దేశ వ్యాప్తంగా విస్తరించింది. ఇప్పటి వరకు ఒక మోస్తరు గుర్తింపు ఉన్న సెలబ్రెటీలపై మాత్రమే ఆరోపణలు వచ్చాయి. కాని మొదటి సారి ఒక స్టార్‌ హీరో అయిన అర్జున్‌ పై లైంగిక వేదింపుల ఆరోపణలు రావడం చర్చనీయాంశం అవుతుంది. అర్జున్‌ తనను ‘విస్మయ’ చిత్రం షూటింగ్‌ సమయంలో లైంగికంగా వేదించాడని - దర్శకుడు చెప్పకుండానే నన్ను దగ్గరకు లాక్కుని - నా వీపుపై నిమిరాడు అంటూ హీరోయిన్‌ శృతి హరిహరన్‌ ఆరోపించిన విషయం తెల్సిందే. ఈ వివాదంపై ఇప్పటికే హీరో అర్జున్‌ స్పందిస్తూ ఆమె విమర్శలను కొట్టి పారేశాడు. ఆ చిత్ర దర్శకుడు కూడా అంతా సాఫీగానే సాగింది, ఆమె ఎందుకు ఇలా అంటుందో అర్థం కావడం లేదంటూ ప్రకటించాడు.

ఒకవైపు అర్జున్‌ కు మద్దతుగా కొందరు నిలుస్తుండగా మరో వైపు మీటూ ఉద్యమంకు మద్దతు తెలుపుతూ కొందరు శృతి హరిహరన్‌ కు సపోర్ట్‌ చేస్తున్నాడు. తెలిసి చేసినా తెలియకుండా చేసినా - ఏ ఉద్దేశ్యంతో చేసినా కూడా ఒక మహిళ వేదింపులకు గురైనట్లుగా భావించిన నేపథ్యంలో ఆమెకు క్షమాపణలు చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉందంటూ ప్రకాష్‌ రాజ్‌ బహిరంగంగానే సోషల్‌ మీడియా ద్వారా శృతి హరిహరన్‌ ప్రకటించడం ప్రస్తుతం కన్నడ సినీ పరిశ్రమలో సంచలనంకు తెర లేపుతోంది.

అర్జున్‌ కు వ్యతిరేకంగా ప్రకాష్‌ రాజ్‌ మాట్లాడటంతో ఇండస్ట్రీ రెండుగా విడిపోయిందనే టాక్‌ కూడా వినిపిస్తుంది. ఇండస్ట్రీలో ప్రముఖులు పలువురు అర్జున్‌ కు మద్దతుగా ఉన్నారని, శృతి హరిహరన్‌ ను చంపేస్తామంటూ కూడా బెదిరిస్తున్నారనే టాక్‌ వినిపిస్తుంది. ప్రకాష్‌ రాజ్‌ తో పాటు ‘యూటర్న్‌’ హీరోయిన్‌ శ్రద్దా శ్రీనాథ్‌ కూడా శృతికి మద్దతు పలికింది. లైంగిక వేదింపులకు పాల్పడే వారిని కఠినంగా శిక్షించాల్సిందే అంటూ డిమాండ్‌ చేస్తున్న కొందరు అర్జున్‌ వెంటనే క్షమాపణలు చెప్పాలని సోషల్‌ మీడియా ద్వారా డిమాండ్‌ చేస్తున్నారు. మొత్తానికి సౌత్‌ లో మీటూ ఉద్యమం మెల్ల మెల్లగా పెరిగి పెద్దదవుతోంది.