Begin typing your search above and press return to search.
సీసీ ఫుటేజ్ చేతికి వస్తే సీన్ మారుతుందా?
By: Tupaki Desk | 15 Oct 2021 11:30 PM GMTపక్కా పొలిటికల్ మూవీకి ఏ మాత్రం తీసిపోని రీతిలో ‘మా’ ఎన్నికల వ్యవహారం సాగుతోంది. అనూహ్య మలుపులతో.. ఊహించని ట్విస్టులతో సాగుతోంది. అందరూ అంచనా వేసినట్లుగా.. కీలకమైన పోలింగ్ రోజున గొడవలు ఖాయమన్న మాట బలంగా వినిపిస్తే.. అందుకు భిన్నంగా అలాంటి అవకాశం ఇవ్వకుండా ప్రశాంత వాతావరణంలో ముగిసేలా చేశారు. ఫలితాలపై కాసిన్ని విమర్శలు.. ఆరోపణలు వచ్చినా.. ఊహించని రీతిలో రెండు రోజులకే ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి.. పోలింగ్ వేళ ఎంత రచ్చ జరిగిందో తెలుసా? అంటూ గెలిచిన వారంతా పెదవి విప్పటం సంచలనంగా మారింది.
అధ్యక్ష స్థానం కోసం పోటీ చేసింది మంచు విష్ణు అయినప్పటికి.. మోహన్ బాబు.. నరేశ్ లు తామే ఎన్నికల్లో పోటీ చేసినంత హడావుడి చేశారంటూ విమర్శలు చేయటంతో పాటు.. సీనియర్ నటుడు ఎంతలా చెలరేగిపోయారో ఒక్కొక్కరు ఏకరువు పెట్టటం.. అంత జరుగుతున్నా.. సంయమనంతో వ్యవహరించినట్లుగా చెప్పుకొచ్చారు. తమ పదవులకు మూకుమ్మడి రాజీనామాలు చేసి.. అధికారం మొత్తం విష్ణు టీంకు దఖలు పరుస్తున్నట్లు స్పష్టం చేశారు.
విష్ణుకు మనస్ఫూర్తిగా సాయం చేస్తామని.. ఎలాంటి అవసరం వచ్చినా తమను సాయం అడగాలని.. పని చేసేందుకు తమకు ఎలాంటి అభ్యంతరం లేదన్న వారి మాటలకు భిన్నంగా తాజాగా ప్రకాశ్ రాజ్ మాటలు ఉన్నాయని చెప్పాలి. పోలింగ్ రోజున.. పోలింగ్ కేంద్రంలో మోహన్ బాబు చెలరేగిన దానికి సంబంధించిన విజువుల్స్ కోసం ఎన్నికల అధికారిని కోరిన వైనం ఇప్పుడు కొత్త మలుపుగా మారింది.
ఓడిపోయారు కదా.. సైలెంట్ అవుతారన్న అంచనాకు భిన్నంగా.. కొత్త తరహాలో ఇష్యూను తెర మీదకు తీసుకురావటం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. సీసీ ఫుటేజ్ చేతిలోకి వస్తే.. తాము చెప్పినట్లే.. మోహన్ బాబు ఎంత ఆవేశంతో వ్యవహరించారన్న విషయం సాక్ష్యంగా మారుతుందని.. దాన్ని ఆయుధంగా వాడాలన్న యోచనలో ఉన్నట్లు చెబుతున్నారు. సీసీ ఫుటేజ్ చేతికి వస్తే.. సీన్ మొత్తం మారటమే కాదు.. సమీకరణాలు కూడా మారతాయన్న మాట బలంగా వినిపిస్తోంది. మరి.. సీసీ ఫుటేజ్ ప్రకాశ్ రాజ్ టీం చేతికి వస్తుందా? రాదా? అన్నదే ఇప్పుడు అసలు ప్రశ్నగా మారింది.