Begin typing your search above and press return to search.
'MAA' కు పోటీగా 'ATMAA'..?
By: Tupaki Desk | 12 Oct 2021 11:40 AM GMT'మా' కుటుంబం ముక్కలు కాబోతోందా? ఇన్నాళ్లూ మాది ఒకటే కుటుంబం.. సినిమా కుటుంబం అంటూ చెప్పుకున్న అసోసియేషన్ లో చీలిక రాబోతోందా? అంటే సినీ సర్కిల్స్ లో అవుననే సమాధానం వినిపిస్తోంది. ఇప్పటి వరకు తెలుగు సినిమా నటీనటులు అభివృద్ధి కోసం పాటు పడిన 'మా' (మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్) రెండుగా విడిపోనుందని రూమర్స్ వినిపిస్తున్నాయి.
తాజాగా జరిగిన 'మా' ఎన్నికల్లో ప్రకాశ్ రాజ్ పై మంచు విష్ణు విజయం సాధించి అధ్యక్షుడిగా ఎన్నికైన సంగతి తెలిసిందే. దీని తర్వాత జరుగుతున్న పరిణామాలు.. సభ్యుల రాజీనామాలు గమనిస్తే మా లో చీలిక ఏర్పడనుందనే అనుమానం కలుగుతోంది. ప్రాంతీయ వాదం మరియు సంకుచిత మనస్తత్వంతో కొట్టు మిట్టులాడుతున్న మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ లో కొనసాగడం తనకు ఇష్టం లేక ప్రాధమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు మెగా బ్రదర్ నాగబాబు ప్రకటించారు.
'మా' ఎన్నికల్లో ప్రాంతీయవాదం - జాతీయవాదం వచ్చి చేరాయని.. అతిథిలా వచ్చాను.. అతిథిలానే ఉంటాను అని ప్రకాశ్ రాజ్ కూడా అసోసియేషన్ కు రాజీనామా చేశారు. 'మా' మాజీ అధ్యక్షుడు నరేశ్ హయాంలో జరిగిన అవకతవకలపై విచారణ జరిపకపోతే తాను 'మా' సభ్యత్వానికి రాజీనామా చేయనున్నట్లు నటుడు శివాజీ రాజా ప్రకటించారు. ఇలా ముగ్గురు 'మా' లో కీలక సభ్యులు బయటకు రావాలనే నిర్ణయానికి వచ్చేసారు. యాంకర్ అనసూయ ఎన్నికల ఓట్ల లెక్కింపుపైనా అనుమానాలు రేకెత్తించేలా ట్వీట్ పెట్టింది. 'ఆదివారం గెలుపు అని చెప్పి ఈ రోజు ఓటమి అంటున్నారు.. రాత్రికి రాత్రి ఏం జరిగింది?' అంటూ సెటైరికల్ గా అన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రకాశ్ రాజ్ ప్యానెల్ నుంచి గెలిచిన సభ్యులందరు రాజీనామాలు చేసి 'మా' కుటుంబాన్ని వీడతారని ప్రచారం జరుగుతోంది.
'మా' ఎన్నికల్లో మొత్తం 18మంది సభ్యుల్లో 8 మంది ప్రకాష్ రాజ్ ప్యానెల్ కు చెందిన అభ్యర్థులు విజయం సాధించారు. బెనర్జీ (ఉపాధ్యక్షుడు) - శ్రీకాంత్(ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్) - ఉత్తేజ్ (జాయింట్ సెక్రటరీ) లతో పాటుగా ఈసీ మెంబర్లుగా శివారెడ్డి - బ్రహ్మాజీ - ప్రభాకర్ - తనీష్ - సురేశ్ కొండేటి - సమీర్ - సుడిగాలి సుధీర్ - కౌశిక్ గెలుపొందారు. ఈరోజు మంగళవారం సాయంత్రం ప్రకాశ్ రాజ్ ప్యానెల్ సభ్యులు ప్రెస్ మీట్ పెడతారని.. ఈ సమావేశంలో అందరూ రాజీనామా ప్రకటన చేస్తారని ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
అంతేకాదు 'మా' అసోసియేషన్ మీద అసంతృప్తితో ఉన్న సభ్యులందరూ కలసి 'మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్' కు పోటీగా మరో అసోసియేషన్ పెట్టబోతున్నారని టాక్ నడుస్తోంది. 'ఆత్మా' (ఆల్ తెలుగు మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్-ATMAA) అనే పేరుతో ఈ కొత్త సంస్థ ఏర్పాటు అవుతుందని పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. ఈరోజు ప్రకాష్ రాజ్ ప్యానల్ పెట్టేది నిజమే అయితే.. 'ఆత్మా' పై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.
ఒకవేళ ప్రకాష్ రాజ్ ప్యానల్ లో గెలిచిన వారందరూ రాజీనామాలు చేసి.. కొందరు టాలీవుడ్ ప్రముఖులతో కలిసి మరో కొత్త అసోసియేషన్ ఏర్పాటు చేసేది నిజమే అయితే.. ఇది తెలుగు చిత్ర పరిశ్రమ ప్రతిష్టకే మాయని మచ్చగా మిగిలిపోయింది. తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచ వ్యాప్తంగా తీసుకెళ్తున్న తరుణంలో ఉమ్మడి కుటుంబం లాంటి 'మా' లో చీలికలు రావడం.. యూనిటీ లేకపోవడం వంటివి టాలీవుడ్ కు ఇబ్బందులు తెచ్చి పెట్టే అవకాశం ఉంది. అలానే దీనిపై సినీ పెద్దలు ఎలా స్పందిస్తారనేది కూడా ఆసక్తికరమే. మరి రాబోయే రోజుల్లో ఏమి జరుగుతుందో అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు.