Begin typing your search above and press return to search.
వకీల్ విషయంలో పూరీకి థాంక్స్: ప్రకాష్ రాజ్ వైరల్ ట్వీట్
By: Tupaki Desk | 9 April 2021 11:42 AM GMTసినిమా సినిమానే రాజకీయం రాజకీయమే అని అంటున్నారు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. ఆయన నటించిన లేటెస్ట్ మూవీ వకీల్ సాబ్. ఆ సినిమా ఈరోజు విడుదలై థియేటర్లలో దుమ్ము దులుపుతోంది. దాదాపు మూడేళ్ల తర్వాత పవన్ నుండి సినిమా రావడంతో ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు. ఆ పండగ వాతావరణం ఇప్పుడు వకీల్ సాబ్ సినిమా థియేటర్స్ వద్ద క్లియర్ గా కనిపిస్తుంది. అయితే ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ పవర్ ఫుల్ లాయర్ సత్యదేవ్ పాత్రలో నటించగా.. ఆయనకు పోటాపోటీగా అపోజిట్ లాయర్ పాత్రలో ప్రకాష్ రాజ్ నటించాడు. వకీల్ సాబ్ సినిమాలో కోర్టు సన్నివేశాలే ప్రముఖమని అందరికి తెలిసిందే. అయితే ఇప్పుడు సినిమాలో పవన్ కళ్యాణ్ - ప్రకాష్ రాజ్ కాంబినేషన్ పై సోషల్ మీడియాలో వార్తలు హల్చల్ చేస్తున్నాయి.
ఎందుకంటే తాజాగా ప్రకాష్ రాజ్.. వకీల్ సాబ్ సినిమా పై ట్వీట్ చేసాడు. ఈ సినిమాలో ప్రకాష్ రాజ్ 'నంద' అనే న్యాయవాదిగా నటించాడు. అయితే పవన్ కళ్యాణ్ తో ఇరవై ఏళ్ల వెనక్కి వెళ్ళిపోయాడు ప్రకాష్. ఎలాగంటే.. నిజానికి పవర్ ఫుల్ క్యారెక్టర్ అపోజిట్ ఉన్నప్పుడే మనం కూడా మరింత ఉత్సాహంగా సీన్ పండించే ప్రయత్నం చేస్తామని ఇదివరకు పవన్ చెప్పాడు. సినిమాలో అపోజిట్ ప్రకాష్ రాజ్ ఉన్నాడు కాబట్టి కోర్టు సీన్స్ అంత ఎఫెక్టీవ్ గా పండాయని సినీవర్గాలు చెబుతున్నాయి. అయితే తాజాగా ప్రకాష్ రాజ్ ట్విట్టర్ వేదికగా.. 'వకీల్ సాబ్ ఫెస్టివల్ బిగిన్స్.. థాంక్యూ పూరీ జగన్నాథ్.. బద్రి అండ్ నంద కాంబినేషన్ క్రియేట్ చేసినందుకు. అదే కాంబినేషన్ మరోసారి థియేటర్లో దుమ్ము రేపుతోంది' అంటూ ట్వీట్ చేసాడు. ప్రస్తుతం ప్రకాష్ రాజ్ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.