Begin typing your search above and press return to search.
‘జెండా’ఎగరేస్తాం.. ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా ప్రకాశ్ రాజ్ ట్వీట్
By: Tupaki Desk | 15 Aug 2021 4:30 AM GMTరెండే రెండు పదాలు.. ఇప్పుడు టాలీవుడ్ లో కొత్త చర్చకు తెర తీస్తున్నాయి. సూటిగా.. ఎలాంటి సుత్తి లేకుండా నేరుగా విషయంలోకి వెళ్లిపోయి పెట్టేసిన రెండు పదాలకు ఎవరికి వారు వారికి తోచిన విశ్లేషణలు చేసుకుంటున్నారు. ఇంతకీ అసలా ట్వీట్ ఏంది? ఎవరు పోస్టు చేశారు? దానికి అర్థమేమిటి? అన్నదిప్పుడు ప్రశ్నగా మారింది. ఇంతకీ విషయం ఏమంటే.. శనివారం సాయంత్రం వేళలో.. హటాత్తుగా తన ట్విటర్ ఖాతాలో ‘‘జెండా’’ ఎగరేస్తాం.. అంటూ పెట్టిన పోస్టుకు అర్థమేమిటి? అన్నదిప్పుడు హాట్ టాపిక్ గా మారింది.
మొన్నటివరకు సినిమాల్లో నటన గురించి మాత్రమే మాట్లాడే ప్రకాశ్ రాజ్.. అప్పుడప్పుడు ప్రధాని మోడీ అండ్ కో మీద విరుచుకుపడేవారు. జస్క్ ఆస్కింగ్ అంటూ ఆయన సంధించే ప్రశ్నలు సంచలనాలకు కారణమవుతోంది. ముక్కుసూటి తనానికి ప్రతిరూపంగా ఉండే ప్రకాశ్ రాజ్ ఎప్పుడైతే మా ఎన్నికల్లో ఎప్పుడైతే అధ్యక్ష స్థానానికి పోటీ చేస్తానని చెప్పారో అప్పటి నుంచి ఆయనపై విమర్శలు ఎక్కువ అయ్యాయి. మొదట లోకల్.. నాన్ లోకల్ అంటూ చెత్త వాదనను రావటం.. దాన్ని మొగ్గదశలోనే తుంచేయటంలో ప్రకాశ్ రాజ్ అండ్ కో విజయం సాధించారని చెప్పాలి.
అయితే.. ప్రకాశ్ రాజ్ కు పోటీగా పలువురు ఎన్నికల బరిలోకి రావటం.. వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. ఒకరికి ఒకరు పంచ్ లు.. కౌంటర్లు ఇచ్చుకుంటున్న వేళలో సీనియర్ నటి హేమ ఎంట్రీ ఇచ్చి.. ‘మా’ ఎన్నికల్ని వెంటనే నిర్వహించాలన్న డిమాండ్ తో పాటు.. ప్రస్తుతం అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్న నరేశ్ పై ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఇది సరిపోదన్నట్లు మెగాస్టార్ చిరంజీవి ఎంట్రీ ఇచ్చి లేఖ రాయటం ఒక ఎత్తు అయితే.. ఆయన లేఖ రాశారో లేదో రెండు రోజుల వ్యవధిలో దాదాపు వందకు పైనే ఎన్నికల నిర్వహణ మీద స్పష్టత ఇవ్వాలని.. నిర్ణయం తీసుకోవాలన్న ఒత్తిడి పెరుగుతోంది.
ఇలాంటి వేళలో కామ్ గా ఉన్న ప్రకాశ్ రాజ్.. షూటింగుల్లో బిజీగా ఉంటున్నారు. తాజాగా ఒక షూటింగ్ లో గాయపడిన ఆయన్ను చెన్నై నుంచి హైదరాబాద్ కు తీసుకొచ్చి సన్ షైన్ ఆసుపత్రిలో చేర్చారు. డాక్టర్ గురవారెడ్డి ఆయనకు శస్త్రచికిత్స చేశారు. తాజాగా ఆయన రికవరీ అయ్యారని.. డిశ్చార్జి చేసినట్లుగా తెలుస్తోంది. ఇదిలా ఉంటే.. ఆగస్టు 15కు రోజు ముందుగా ప్రకాశ్ రాజ్ పెట్టిన పోస్టు ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ‘జెండా ఎగరేద్దాం’ అంటూ తన మనసులోని మాట ఎవరికి అర్థం కానట్లుగా.. ఎవరికి తోచిన భావం వారు చెప్పుకునేలా ఆయన ట్వీట్ ఉందంటున్నారు. ఇంతకీ ఈ ట్వీట్ ఫజిల్ ను ప్రకాశ్ రాజ్ ఎప్పుడూ తీరుస్తారు? అన్నది ప్రశ్న.
ఆయన ట్వీట్.. జెండా ఎగరేస్తామన్న మాట ‘మా’ ఎన్నికల ఎజెండాతో చేసిందా? లేదంటే స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని చేశారా? అన్నదిప్పుడు ప్రశ్నగా మారింది. సందర్భానికి అనుగుణంగా ‘మా’ ఎన్నికల్లో గెలుపు తమదేనన్న ధీమాతో ఇలా చేశారా? అన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ఏమైనా ఇలాంటి వాటికి దీనికి సరైన సమాధానం చెప్పగలిగింది ప్రకాశ్ రాజ్ ఒక్కరే. మరి ఆయన ట్వీట్ మిస్టరీని ఎప్పుడు తేలుస్తారు? అన్న ఉత్కంట ఇటు ఇండస్ట్రీలోనే కాదు.. అభిమానుల్లోనూ వ్యక్తమవుతోంది.