Begin typing your search above and press return to search.
ప్రకాష్ రాజ్ Vs విష్ణు! విందు రాజకీయాల పసందు!!
By: Tupaki Desk | 12 Sep 2021 11:30 AM GMTఏందో ఈ విందు రాజకీయాలు.. ఇవేమైనా పంచాయితీ ఎలక్షన్లా.. ఎమ్మెల్యే ఎలక్షన్లా... మునిసిపోల్సా!! అంటూ ఒకటే `మా` ఎన్నికలపై సెటైర్లు పడుతున్నాయి. చూస్తుంటే వాటిని మించిపోతున్నాయి విందు రాజకీయాలు. లంచ్ లు డిన్నర్ లు అంటూ వేడెక్కించేస్తున్నారు. నైట్ పార్టీల్లో మత్తెక్కించేస్తున్నారు. అక్టోబర్ 10న మూవీ ఆర్టిస్టుల (మా) ఎన్నికల డే వరకూ ఇదే పరిస్థితి ఉంటుంది.
ఇంతకుముందే నరేష్ లంచ్ పార్టీలు ఆ తరవాత బరిలో దిగి ప్రకాష్ రాజ్ ఆకస్మిక పార్టీ గురించి తెలిసినదే. ఇప్పుడు మరోసారి ప్రకాష్ రాజ్ విందు రాజకీయం ప్రముఖంగా చర్చకు వచ్చాయి. ఆయన ఆదివారం హైదరాబాద్ లోని ఓ ప్రముఖ వెన్యూలో విందు ఏర్పాటు చేసారు. ``కలిసి మాట్లాడుకుందాం.. మన లక్ష్యాలపై చర్చించుకుందాం.. సహపంక్తి భోజనం చేద్దాం`` అంటూ ఆయన పంపిన ఆహ్వానం అందుకుని సభ్యులంతా విచ్చేశారు. ఈ విందులో ప్రకాష్ రాజ్ తెలివిగా అసంతృప్తుల్ని బుజ్జగించారట. మరోవైపు మంచు విష్ణు కూడా తన వర్గాన్ని సంతుష్టులను చేసేందుకు సైలెంట్ గా మంత్రాంగం నడిపిస్తున్నారని సమాచారం. మంచు విష్ణుకు వీకే నరేష్ నుంచి అతడి వెంట వచ్చే వంద మంది ఓటర్ల నుంచి మద్ధతు ఉందని తెలుస్తోంది.
గుట్టు చప్పుడు కాకుండా సామాజిక రాజకీయం
మూవీ ఆర్టిస్టుల సంఘం ఎన్నికలు రకరకాల పోకడలకు నాంది పలుకుతున్నట్టు 950 మంది సభ్యుల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. పరిశ్రమలోనూ ఇవి స్ప్రెడ్ అవుతున్నాయి. ఎన్నడూ లేనంతగా ఈసారి సామాజిక వర్గాల వారీగా ఆర్టిస్టులు విడిపోయి ఓటింగుకి సిద్ధమవుతున్నట్టు కూడా ప్రచారం సాగుతోంది. సామాజిక వర్గాల పోరు అనాదిగా ఉన్నదే అయినా పైకి రానివ్వరు. కానీ ఈసారి బహిరంగంగానే దానిపై మాట్లాడుకుంటున్నారు. మునుముందు మూవీ ఆర్టిస్టుల సంఘం (మా) లో ప్రతిదీ ప్రతిష్ఠాత్మకంగానే మారుతున్నాయి. ఈ నేపథ్యంలో వర్గాల వారీగా మెజారిటీ కోసం ప్రయత్నిస్తున్నారు. అయితే ఇలాంటి పోటీ ఆరోగ్యకరమైనది కాదని విమర్శలు వస్తున్నాయి. ఇన్నాళ్లు లేనిది ఇప్పుడిలా సామాజిక వర్గాల్ని తెరపైకి తేవడం సరికాదన్న సూచన చేస్తున్న వారు లేకపోలేదు.