Begin typing your search above and press return to search.

ఆ అవార్డు కావాలంటున్న ప్రకాష్ రాజ్

By:  Tupaki Desk   |   17 April 2017 10:14 AM GMT
ఆ అవార్డు కావాలంటున్న ప్రకాష్ రాజ్
X
ఒకటి రెండు కాదు.. ఏకంగా ఐదు జాతీయ అవార్డులు అందుకున్న నటుడు ప్రకాష్ రాజ్. దీంతో పాటుగా అనేక ప్రతిష్టాత్మక పురస్కారాలు ఆయన్ని వరించాయి. ఐతే ఈ అవార్డులన్నీ ఒకెత్తని.. తనకు కొత్తగా ఇప్పుడు ఉత్తమ రైతుగా జాతీయ అవార్డు అందుకోవాలని ఉందని అంటున్నాడు ప్రకాష్ రాజ్. హైదరాబాద్ శివార్లలో ఒక వ్యవసాయ పొలం కొనుక్కున్న ప్రకాష్ రాజ్.. అక్కడ పెద్ద ఎత్తున సేంద్రియ వ్యవసాయం చేస్తున్న సంగతి తెలిసిందే. రైతుగా మారాకే తన జీవితానికి సార్థకత ఏర్పడిందని.. తన జీవితం కొత్తగా మొదలైందని.. రైతుగా ఉండటంలో.. పంటలు పండించడంలో ఉన్న కిక్కే వేరని ప్రకాష్ రాజ్ అన్నాడు.

నటుడిగా ఎంత సాధించినప్పటికీ ఈసారి రైతుగా జాతీయ అవార్డు తీసుకోవాలన్నది తన లక్ష్యమని.. ఆ విషయంలో చాలా సీరియస్ గా ఉన్నానని ‘మీలో ఎవరు కోటీశ్వరుడు’ కార్యక్రమంలో ప్రకాష్ రాజ్ వ్యాఖ్యానించాడు. ఇక మహబూబ్ నగర్ జిల్లాలోని కొండారెడ్డి పల్లిని దత్తత తీసుకుని అక్కడ సేవా కార్యక్రమాలు చేపడుతుండటంపై ప్రకాష్ రాజ్ స్పందిస్తూ.. ఎక్కడో పుట్టి.. ఎక్కడో పెరిగి.. అన్ని భాషల వాళ్ల అభిమానం చూరగొన్న తాను చివరికి ఎక్కడో మారుమూల పల్లెలోని వాళ్లతో అన్నయ్యా అని.. బాబాయ్ అని.. తాతయ్యా అని పిలిపించుకోవడం గొప్పగా అనిపిస్తోందని అన్నాడు. తన కూతురిని ఫారిన్లో చదివించాలన్న నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంటే.. ఆ డబ్బుతో ఇక్కడ 200 మంది పిల్లలకు చదువు చెప్పించొచ్చని ప్రకాష్ రాజ్ చెప్పాడు. కొండారెడ్డి పల్లిని మోడల్ గ్రామంగా తీర్చిదిద్దే పని పూర్తి కావస్తోందని.. ఆ తర్వాత మరో పల్లెకు వెళ్తానని ప్రకాష్ రాజ్ అన్నాడు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/