Begin typing your search above and press return to search.

5 కోట్లు ఎగ్గొట్టాడు! ప్ర‌కాష్ రాజ్ పై చెక్ బౌన్స్ కేసు!!

By:  Tupaki Desk   |   28 Feb 2020 6:30 AM GMT
5 కోట్లు ఎగ్గొట్టాడు! ప్ర‌కాష్ రాజ్ పై చెక్ బౌన్స్ కేసు!!
X
విల‌క్ష‌ణ న‌టుడు ప్ర‌కాష్ రాజ్ కి వివాదాలు కొత్తేమీ కాదు. ఇండ‌స్ట్రీ సీనియ‌ర్ న‌టుడిగా ఆయ‌న యారొగెన్సీపై ర‌క‌ర‌కాల ఆరోప‌ణ‌లు ఉన్నాయి. దాంతో అత‌డి కెరీర్ ఆల్మోస్ట్ జీరో అయిన సంగ‌తి తెలిసిందే. అడ‌పాద‌డ‌పా సీనియ‌ర్లు.. స్నేహితులు ఆయ‌న‌కు అవ‌కాశాలిచ్చి ప్రోత్స‌హిస్తున్నా .. చాలా మంది లైట్ తీస్కున్నారు. ప్ర‌కాష్ రాజ్ రాజ‌కీయాలు.. భాజ‌పాపై వ్య‌తిరేక‌త‌.. తెలంగాణ పొలాల్లో ఆర్గానిక్ ఫామింగ్ వ‌గైరా వ‌గైరా తెలిసిందే.

తాజాగా ప్ర‌కాష్ రాజ్ ఓ సినిమా నిర్మాణానికి సంబంధించిన‌ ఆర్థిక వ్య‌వ‌హారాల్లో కోర్టు కేసులో బుక్క‌య్యారు. దాదాపు 5కోట్ల మేర చెక్ బౌన్స్ కేసును ఎదుర్కొంటున్నారు. ఆ మేర‌కు ప్రకాశ్ రాజ్ కు మద్రాసు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. ప్రకాశ్ రాజ్ నిర్మిస్తున్న `నడిగర్‌` (ఉన్‌ సమయల్‌ అరైయిల్ త‌మిళ చిత్ర రీమేక్) కోసం ఓ ఫైనాన్సియ‌ర్ నుంచి రూ.5 కోట్లు అప్పు తీసుకుని చెక్ లు ఇచ్చార‌ట‌. అయితే అవి బ్యాంకులో బౌన్స్ అయ్యాయ‌ని స‌ద‌రు ఫైనాన్షియ‌ర్ ఆరోపిస్తున్నారు. ప్ర‌స్తుతం మద్రాసు హైకోర్టులో పిటిషన్‌ ను విచారించిన న్యాయమూర్తి ఏప్రిల్‌ 2లోగా కోర్టుకు హాజరవ్వాలని నటుడు ప్రకాశ్ రాజ్ కు సమన్లు జారీ చేశారు.

ఆర్థిక వ్య‌వ‌హారాల్లో చెక్ బౌన్స్ కేసులు పెద్ద త‌ల‌నొప్పి వ్య‌వ‌హార‌మే. ఇప్ప‌టికే ప్ర‌కాష్ రాజ్ కి ఉన్న త‌ల‌ నొప్పుల‌కు ఇది అద‌నం అనే చెప్పాలి. ప్ర‌స్తుతం అత‌డు క్రియేటివ్ డైరెక్ట‌ర్ కృష్ణ‌వంశీ తెర‌కెక్కిస్తున్న తాజా చిత్రం `రంగ మార్తాండ‌`లో ఓ కీల‌క పాత్ర‌ లో ప్రకాష్ రాజ్ న‌టిస్తున్న సంగ‌తి తెలిసిందే. అటు జ‌య‌ల‌లిత బ‌యోపిక్ లోనూ ఆయ‌న ఓ ప్ర‌ధాన భూమిక పోషిస్తున్నార‌న్న స‌మాచారం ఉంది.